సార్..మా అమ్మను రక్షించండి..KTRకు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వేడుకోలు

సార్..మా అమ్మను రక్షించండి..తెలంగాణ రాష్ట్ర మంత్రి KTRకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్..అమ్మ కనిపించడం లేదు..ఎక్కడ ఉందో తెలియదు..సహాయం చేయండి అంటూ..2020. జనవరి 30వ తేదీన హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిని మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీ, నితీష్ కుమార్, డీజీపీ బీహార్‌లకు ట్వీట్ చేశారు.
దీంతో మంత్రి కేటీఆర్ 2020, ఫిబ్రవరి 01 తేదీ శనివారం స్పందించారు. లేటుగా రెస్పాండ్ అయ్యినందుకు సారీ చెప్పారు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ఆఫీసు వారితో మాట్లాడడం జరుగుతుందని, ఆమె తల్లిని గుర్తించేందుకు కృషి చేయడం జరుగుందని, ఈ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసి సహాయం చేయాలని నెటిజన్లను మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ ట్వీట్‌ను తెలంగాణ డీజీపీకి పంపించారు.
వెంటనే డీజీపీ స్పందించారు. బీహార్ రాష్ట్ర డీజీపీని సంప్రదించడం జరుగుతుందని, యువతి అమ్మను గుర్తించేందుకు కృషి చేయాలని తాము కోరడం జరిగిందని ట్వీట్‌లో వెల్లడించారు.
Read More : కరోనా కాటేస్తోంది : చైనాలో మృత్యు ఘోష
బీహార్ రాష్ట్రంలో 2020, జనవరి 29వ తేదీ రాత్రి 8గంటల నుంచి అమ్మ కనిపించడం లేదని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉందని, తనకు సహాయం చేయాలని జనవరి 30వ తేదీన మంత్రి కేటీఆర్‌కు యువతి ట్వీట్ చేశారు. జనవరి 31వ తేదీన మరో ట్వీట్ చేశారు. తాను ఇంకా రెస్పాండ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు, తన తల్లి పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. అమ్మ ఆచూకి కోసం తాను ప్రయత్నిస్తూనే ఉన్నానని తెలిపారు.
మంత్రి కేటీఆర్ స్పందించారని, కానీ తల్లి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్, డీజీపీ స్పందించినందుకు యువతి సోదరుడు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రభుత్వం, పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చాలా మంది నెటిజన్లు..రీ ట్వీట్ చేస్తున్నారు.
Sir we are still unable to find her, attaching my mom’s pic.
Please help on this @KTRTRS @RamanKu00279095 @NitishKumar @AmitShah @smritiirani https://t.co/XxqncXGjKv pic.twitter.com/YwL0NfPhjw— Garima (@Garima56376567) February 1, 2020