గుడ్ న్యూస్, ఉగాదికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలిగాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పిటిషన్ పై బుధవారం(మార్చి 18,2020) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది. అదే సమయంలో తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఈసీని కోర్టు ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ అడ్డుకాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉగాది రోజున 25లక్షల పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గం సుగమైంది.
యథావిథిగా 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ:
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల కోడ్ ఎత్తేయడం సంతోషం అన్నారు. కోడ్ ఎత్తేయడంతో పథకాలు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఉగాది రోజున 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. కరోనా మరింత వ్యాప్తి చెందకముందే ఎన్నికలు నిర్వహించాలని మంత్రి కోరారు. కరోనా అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాగా, ఎన్నికలు వాయిదా పడటం దురదృష్టకరమని వైసీపీ నేతలు వాపోయారు. షెడ్యూల్ ప్రకారమే నిర్వహించి ఉంటే వారం 10 రోజుల్లో ఎన్నికలు అయిపోయేవి అన్నారు.
ఎన్నికల నిర్వహణలో ఈసీదే ఫైనల్ నిర్ణయం:
కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. రాజకీయ రగడకు దారి తీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండానే ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశారని వాదనలు వినిపించింది. కరోనా వైరస్ కట్టడికి స్థానిక ప్రజాప్రతినిధులు అవసరం చాలా ఉందని కోర్టుకి విన్నవించింది. కాగా, ఏపీలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఎన్నికలు వాయిదా వేశామని ఈసీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. ఎన్నికల వాయిదా నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంది.
ఉగాదికి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈసీ ఎన్నికల కోడ్ విధించింది. ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్ వేసింది. దీన్ని జగన్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లింది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి.
See Also | ఏపీలో ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, కోడ్ ఎత్తేయాలని ఆదేశం