ఆర్టీసీలో యూనియన్లకు చెక్ : టీఎంయూ ఆఫీసుకు తాళం

తెలంగాణ ఆర్టీసీలో యూనియన్లకు చరమగీతం పాడేందుకు సంస్థ యాజమాన్యం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆర్టీసీ గుర్తింపు పొందిన TMU కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకుల విధుల నుంచి మినహాయింపు రద్దు చేశారు. టీఎంయూలో 30 మందికి రిలీఫ్ డ్యూటీలు రద్దు చేశారు. ఎంప్లాయిస్ యూనియన్‌లో ముగ్గురికి, SFWలో ఒకరికి రిలీఫ్ డ్యూటీని క్యాన్సిల్ చేశారు.
> తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
> ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఉత్పన్నమయ్యే ఛాన్స్ లేదని, యూనియన్ల మాయలో పడవద్దని కార్మికులకు సీఎం కేసీఆర్ సూచించారు.
> విధుల్లో చేరాలని పలుమార్లు గడువు విధించారు. అయినా.. కూడా కార్మికులు బేఖాతర్ చేశారు.
> దీంతో సమ్మె 52 రోజులకు పైగా కొనసాగింది. హైకోర్టుకు చేరినా…స్పష్టమైన తీర్పును వెలువడలేదు.
> లేబర్ కోర్టుకు బదలాయించింది. దీంతో ఆర్టీసీ జేఏసీ పునరాలోచనలో పడిపోయింది.
> చివరకు సమ్మె విరమిస్తున్నట్లు..తమను విధుల్లో చేర్చుకోవాలని కోరింది. దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు.
> సెప్టెంబర్ నెల జీతాలు లేక..విధుల్లో చేర్చుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
> సమ్మె ప్రారంభమైన తర్వాత కొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా..మరికొందరు గుండెపోటుతో..అస్వస్థతకు గురై చనిపోయారు.
> ఈ క్రమంలో 2019, నవంబర్ 28వ తేదీ తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీపై ప్రధానంగా చర్చించింది.
> కార్మికులు విధుల్లోకి హాజరు కావచ్చని, చనిపోయిన కార్మిక కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చింది.
> ఆర్టీసీ యూనియన్లు, ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలకు లొంగిపోవద్దని సీఎం కేసీఆర్ సూచించారు.
> సంస్థ ప్రక్షాళన చేస్తామని, కార్మికులతో మాట్లాడుతానని కేసీఆర్ స్ఫష్టం చేశారు.
> తాజాగా సంస్థ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలతో యూనియన్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Read More : ప్రభుత్వానికి కృతజ్ఞతలు – ఆర్టీసీ జేఏసీ