BRS MP Candidates : ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు..!

ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా కేసీఆర్ చర్చించారు.

BRS MP Candidates : ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు..!

BRS MP Candidates

BRS MP Candidates : తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. బి.వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా కేసీఆర్ చర్చించారు. జన సమీకరణ, ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. 10వ తేదీన కరీంనగర్ మెడికల్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై కేసీఆర్ సమీక్ష చేపట్టారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కరీంనగర్ లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బి.వినోద్ కుమార్ కే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ రెండు పేర్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read : బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా.. ఆ మూడు స్థానాల్లో అసమ్మతి రాగం