Maharashtra Politics: అజిత్ పవార్ ఎంట్రీతో మహా ప్రభుత్వంలో అసమ్మతి.. అనుమానాలకు తావునిస్తూ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లిన షిండే
షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం చేరడం పట్ల షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు

Eknath Shinde: ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేరికతో మహారాష్ట్ర ప్రభుత్వంలో అసమ్మతి వర్గం లేచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శివసేన వర్గంలో ఇది చాలా పెరిగిందని, ఆ వర్గం నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని కొద్ది రోజుల క్రితం అజిత్ పవార్ వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఆయన శివసేన-బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపడం చాలా అనుమానాలను తావిస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని చీల్చడానికే అజిత్ పవార్ చేరారని అధికార పార్టీల్లోని కొందరు అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
West Bengal : బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…
దీనికి తోడు.. షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం చేరడం పట్ల షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ వర్గంలో అలాంటి అసంతృప్తి ఏమీ లేదని షిండే రెండు రోజుల క్రితం స్పష్టతనిచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
ఇక ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఢిల్లీకి వెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. వాస్తవానికి ఇది ముందస్తు నిర్ణయించింది కాదు. ఉన్నట్టుండి ఆయన ఢిల్లీకి బయల్దేరారు. దీంతో ప్రభుత్వంలో పెరుగుతున్న అసంతృప్తుల గురించే చర్చించడానికి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది.