మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సంచలన నివేదిక

ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డుల మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. మేడిగడ్డ డిజైన్‌కు, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి.

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సంచలన నివేదిక

Medigadda Baragge Damage

Updated On : February 1, 2024 / 10:33 PM IST

Medigadda Baragge Damage : మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్ల కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది. మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని ఓ అంచనాకు వచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో కాంక్రీట్, స్టీల్‌లో నాణ్యత లోపం గుర్తించింది. ప్రాజెక్ట్ ప్రారంభం నాటికే పగుళ్లు వచ్చాయని విజిలెన్స్‌ అనుమానిస్తోంది. వరదలతో డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే మేడిగడ్డలో డ్యామేజ్‌ అని అంచనా వేసింది విజిలెన్స్.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. అటు కరీంనగర్, భూపాలపల్లిలో ఉన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ ని విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ పూర్తిగా పరిశీలించారు. మొత్తంగా మేడిగడ్డ కుంగుబాటు.. మానవ తప్పిదం వల్లే అని డ్యామేజ్ జరిగింది అనే ఒక అంచనాకు విజిలెన్స్ అధికారులు వచ్చినట్లు సమాచారం. వరదలతో డ్యామేజ్ జరగలేదని కేవలం మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ నివేదికలో తేలింది.

Also Read : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోకల్, నాన్‌లోకల్ వార్.. కరీంనగర్‌లో హీటెక్కిన రాజకీయం

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక..
”2019లోనే మేడిగడ్డ డ్యామేజ్‌ అయ్యింది. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు బయటపడ్డాయి. పగుళ్లను రిపేర్‌ చేయాలంటూ.. వర్షా కాలానికి 10రోజుల ముందే ఎల్‌ అండ్‌ టీకి ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు. అయితే, ఎల్‌ అండ్‌ టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. వర్షా కాలంలో మెయింటెనెన్స్‌ రిపేర్స్‌ సాధ్యం కాదని అప్పట్లో ఎల్‌ అండ్‌ టీ సంస్థ నివేదిక ఇచ్చింది. తర్వాత వచ్చిన వరదలకి 11 నుంచి 20 పియర్స్‌ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లను అధికారులు గుర్తించకపోవడంతో డ్యామ్‌ ప్రమాదంలో పడింది. ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డుల మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. ఒకటి నుంచి ఐదో పిల్లర్‌ వరకు పగుళ్లు ఏర్పడ్డాయి. మేడిగడ్డ డిజైన్‌కు, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి”.

ప్రాజెక్టు పిల్లర్లు, బ్లాక్స్‌లో నాణ్యతపైన విజిలెన్స్ దృష్టి పెట్టింది. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు అధికారులు. ఇప్పటివరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారించారు. త్వరలో పంప్ హౌజ్‌లపై కూడా విచారణ చేయనున్నారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటా అడిగింది విజిలెన్స్. రెండు, మూడు రోజుల్లో విజిలెన్స్‌ చేతికి శాటిలైట్ డేటా అందనుంది.

Also Read : కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కన్ఫూజన్‌.. అయోమయంలో నేతలు