బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోకల్, నాన్‌లోకల్ వార్.. కరీంనగర్‌లో హీటెక్కిన రాజకీయం

నీకన్నా ముందు నేను పుట్టా... నేను పక్కా లోకల్‌ అంటూ మరొకరు వాదులాడుకోవడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తోంది..

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోకల్, నాన్‌లోకల్ వార్.. కరీంనగర్‌లో హీటెక్కిన రాజకీయం

Local Non Local War

Local Non Local War : ఎవరు లోకల్‌.. ఎవరు నాన్‌లోకల్‌.. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సిట్టింగ్‌ ఎంపీ, మాజీ ఎంపీ మధ్య కొనసాగుతున్న డైలాగ్‌ వార్‌ ఇంట్రస్టింగ్‌గా మారింది. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే ఉంటా… నీది ఏ ఊరు..? నీకిక్కడేం పని అంటూ ఒకరు? నీకన్నా ముందు నేను పుట్టా… నేను పక్కా లోకల్‌ అంటూ మరొకరు వాదులాడుకోవడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తోంది.. ఈ లోకల్‌ నాన్‌లోకల్‌ లొల్లి రాజకీయాల్లో హీట్ పెంచింది.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు..
పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. త్వరలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. ఎలాలేదన్నా మరో రెండు నెలల్లో లోక్‌సభ ఫైట్‌ జరగడం ఖాయం.. ఇక ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్‌ పెట్టుకున్న ప్రధాన పార్టీలు.. గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నాయి. ఇలా కరీంనగర్‌ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. కరీంనగర్‌ బీజేపీకి సిట్టింగ్‌ స్థానం కాగా, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీఆర్‌ఎస్‌. దీంతో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Also Read : లోక్‌సభ ఎన్నికల రేసులో భట్టి విక్రమార్క భార్య నందిని.. గాంధీ భవన్‌లో కొనసాగుతున్న అప్లికేషన్ల స్వీకరణ

ఇద్దరి మధ్య లోకల్ నాన్ లోకల్ వార్..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వినోద్‌కుమార్‌ పోటీ చేయడం దాదాపు ఖాయమే.. అధికారిక ప్రకటన విడుదలకాకపోయినా.. ఆ రెండు పార్టీల్లో వారికి మించిన అభ్యర్థి లేరన్నది పరిశీలకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే ఫైట్‌ జరిగింది.. ఆ ఎన్నికల్లో సంజయ్‌ గెలవగా, వినోద్‌కుమార్‌కు పరాభవం ఎదురైంది. ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండేటట్లు కనిపిస్తోంది. దీంతో నిన్నమొన్నటి వరకు అభివృద్ధి నిధుల సాధనపై ఈ ఇద్దరి మధ్య మాటలు తూటాల్లా పేలాయి.. రానురాను ఎన్నికల వేడి ఎక్కువవుతుండటంతో ఇద్దరి మధ్య లోకల్‌ నాన్‌లోకల్‌ వార్‌ మొదలైంది.

లోకల్ నాన్ లోకల్ అస్త్రాన్ని సంధించిన బండి..
నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే పోటా పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటుకుంటున్నారు. ఇదే సమయంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌ను ఉధృతం చేసేందుకు ఇద్దరూ కీలకమైన సోషల్ మీడియా వారియర్స్‌ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ‘నేను లోకల్.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ నాన్ లోకల్’ అంటూ ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ హీట్‌ పుట్టిస్తున్నాయి. బండి వ్యాఖ్యలను బీజేపీ సోషల్ మీడియా టీమ్ వైరల్ చేస్తోంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాన్ లోకల్.. ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదని, ఎన్నికలొస్తున్నాయని తెలిసి ప్రజల్లోకి వస్తున్నారంటూ బండి సంజయ్ చేసిన వాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

నీకంటే ముందు పుట్టా.. అంటూ ఎదురుదాడి
బండి సంజయ్ చేస్తున్న వాఖ్యలు ప్రజల్లోకి వెళితే.. బీఆర్ఎస్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా ఏనుగుల్లుకు చెందిన వినోద్‌కుమార్‌కు కరీంనగర్‌తో సంబంధమేంటి? అంటూ ప్రశ్నిస్తోంది బీజేపీ. కేవలం రాజకీయాల కోసమే కరీంనగర్ లోక్‌సభ సీటును ఎంచుకున్నారనే క్యాంపెయిన్‌ను తీవ్రతరం చేస్తోంది. ఈ ప్రచారంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకంటే ముందు కరీంనగర్‌లో పుట్టింది నేను అంటూ… కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.

Also Read : కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కన్ఫూజన్‌.. అయోమయంలో నేతలు

అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో?
బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనే దానిపై స్పష్టత రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో పార్లమెంట్‌ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రస్తుతానికి మాటల యుద్ధంతో దూసుకుపోతున్నాయి.