చంద్రబాబు పాలనలో దోపిడీ : బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(నవంబర్ 29, 2019) ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం 5 లక్షల ఇళ్లు మంజూరైతే 3లక్షల 10 వేల ఇళ్లకు టెండర్లు పిలిచారని తెలిపారు. ఇప్పటి లెక్కల ప్రకారం 2626 కోట్లు దోపిడీ చేశారని విమర్శించారు. 5లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచివుంటే 4250 కోట్లు దోపిడీ జరిగివుండేదన్నారు.
ప్రభుత్వం నుంచి లక్షన్నర సబ్సిడీ ఇచ్చి ఆ మొత్తాన్ని తిరిగి లబ్ధిదారుని నుంచి వసూలు చేస్తే ఏం లాభమని అన్నారు. పేదవాడికి సహాయం చేసినట్లు ఎలా అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన దోపడీని అరికట్టాలని, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని ఆలస్యం చేశామన్నారు. 300 ఎస్ ఎఫ్ టీ ఇళ్లను ఉచితంగా ఇచ్చి లబ్ధిదారులను ఆదుకుంటామని తెలిపారు.
ఒక పైసా కూడా లబ్ధిదారునికి భారం కాకూడదని ప్రభుత్వం భావిస్తుందన్నారు. త్వరగా టెండర్లను పిలిచి లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. చంద్రబాబు చేసిన పాపాలను తుడిచి పెట్టడానికే ప్రజలు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రజలు ఆలోచించాలన్నారు.