టీడీపీ నేతలకు సిగ్గులేదు : మంత్రి కొడాలి నాని
టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ మార్షల్స్ ను దుర్భాషలాడారని అన్నారు. చీఫ్ మార్షల్స్ పై చంద్రబాబు దాడి చేశారని ఆరోపించారు. శుక్రవారం (డిసెంబర్ 13, 2019) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబు కారు అసెంబ్లీ లోపలికి రావడానికి ప్రత్యేక గేట్ ఉందన్నారు. చంద్రబాబు కారులో వచ్చి సీఎం దిగే చోట దిగడానికి అవకాశం ఉందన్నారు.
చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే రోడ్డు మీద కారు దిగి ఎమ్మెల్యేలు వచ్చే గేటు గుండా రావడానికి ప్రయత్నించారని చెప్పారు. ప్లకార్డులు, బ్యానర్లతో కార్యకర్తలతో వస్తే అసెంబ్లీలోకి రానిస్తారా అని ప్రశ్నించారు. సభ్యులు కానివారు అసెంబ్లీలోకి వచ్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. 30 మంది ఎమ్మెల్సీలు, 20 ఎమ్మెల్యేలు, కొంతమంది టీడీపీ కార్యకర్తలతో ప్లేకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మూకుమ్మడిగా లోపలికి వస్తుంటే మార్షల్స్ గేట్లు మూసివేసి ఒక్కొక్కరిని లోపలికి రమ్మన్నారని తెలిపారు.
ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ మార్షల్స్ పై దుర్భాషలాడారని, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పై చేయి పెట్టి అతని రొమ్ములపై తోసేశారని చెప్పారు. అడ్డగోలుగా మార్షల్స్ పై దాడి చేస్తే వారికి దెబ్బలు తగిలితే.. టీడీపీ సభ్యులు లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు.
ఎన్ టీరామారావు… ఈనాడుకు ఉపయోగపడ్డారు కానీ ఈనాడు.. రామారావుకు ఉపయోగపడలేదన్నారు. ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీలో దూరి ఆ వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సభ్యులను నాని హెచ్చరించారు.
సోనియా గాంధీని ఎదురించడం వల్లే జగన్ ను జైల్లో పెట్టారని తెలిపారు. జగన్ నీతి, నిజాయితీగా ఉండి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు కాబట్టే జగన్ ను అక్రమంగా అరెస్టు చేసి, జైలులో పెట్టారని చెప్పారు. వ్యక్తిగా బయలుదేరిన జగన్..వ్యవస్థను సృష్టించారని చెప్పారు.