మార్పుల మంటలు.. తీవ్ర అసంతృప్తిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

హైకమాండ్ నిర్ణయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు.

మార్పుల మంటలు.. తీవ్ర అసంతృప్తిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

Kadiri Mla Pedaballi Venkata Sidda Reddy

Updated On : February 16, 2024 / 9:04 PM IST

Pedaballi Venkata Sidda Reddy : సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. దీంతో అధిష్టానం బుజ్జగింపులకు దిగుతోంది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు. వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా.. కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బూల్ అహ్మద్ పేరును ప్రకటించారు సీఎం జగన్. దీంతో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అసంతృప్తికి లోనయ్యారు.

Also Read : సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!

హైకమాండ్ నిర్ణయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు. కానీ, తనకు వ్యక్తిగత పని ఉందంటూ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. పెద్దిరెడ్డిని కలవలేదు.

మార్పుల్లో భాగంగా ఈసారి కదిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని మార్చేశారు సీఎం జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మైనార్టీ నేత మక్బూల్ భాషాను కదిరి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. అప్పటి నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అసమ్మతి వెళ్లగక్కుతూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసేందుకు రెండు సార్లు ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అందుబాటులోకి రాలేదు. వ్యక్తిగత పని ఉందంటూ మంత్రిని కలవలేదు.

ఇవాళ జిల్లాకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి.. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అందుబాటులో ఉన్నారని తెలుసుకుని.. కదిరి వైసీపీ ఇంఛార్జ్ మక్బూల్ భాషాను తన వెంట తీసుకుని ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిశారు. కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. కచ్చితంగా పార్టీలో మీకు గుర్తింపు ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : గుంటూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే?

మంత్రి పెద్దిరెడ్డి సూచన మేరకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా? లేదా? సిద్ధం సభకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.