Women Reservation Bill: 27 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్ పడుతుందా? మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేసేందుకు మోదీ ప్రభుత్వం బిగ్ ప్లాన్!

2019 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే

Women Reservation Bill: 27 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్ పడుతుందా? మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేసేందుకు మోదీ ప్రభుత్వం బిగ్ ప్లాన్!

Women Reservation Bill in Parliament: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను కూడా మోదీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ప్రత్యేక సమావేశంలో ఏదో పెద్ద సంఘటనే జరుగుతుందని విపక్షాలు ఇప్పటికీ భయపడుతున్నాయి. ఒకవైపు ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ వంటిది ఇప్పటికే విపక్షాలను అతలాకుతలం చేస్తుండగా.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును సైతం తెరపైకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని అంటున్నారు.

వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అన్ని పార్టీ అజెండాలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రధాన అజెండాలో కూడా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ అంశంపై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక గత అనేక ప్రభుత్వాల్లో ఈ బిల్లు పార్లమెంటులోకి పలుమార్లు చర్చకు వచ్చినప్పటికీ.. చర్చల్లోనే నిలిచిపోయింది. దేవెగౌడ ప్రభుత్వం దగ్గరి నుంచి, అటల్ బిహారీ ప్రభుత్వం, మన్మోహన్ ప్రభుత్వ హయాంలో ఇది కీలకాంశంగా ఉంది. అయితే ఆ ప్రభుత్వాలకు సరిపడా మెజారిటీ లేక పార్లమెంట్ గడప లోపలే ఆగిపోయింది. అయితే ఈ బిల్లును చట్టంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ తన 2019 మేనిఫెస్టోలో పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ తన రాజకీయ సమీకరణాలను సరిదిద్దుకునేందుకు ఈ బిల్లు సాయం తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. ఇటీవల, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరలో ఆమోదించనున్నట్లు చెప్పారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో చట్టం చేసి దేశంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

27 ఏళ్లుగా చర్చలో మహిళా రిజర్వేషన్ బిల్లు
1996లో హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడం గురించి మాట్లాడింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, దీంతో అధికారంలో వారి భాగస్వామ్యం పెరుగుతుందని దేవెగౌడ అప్పట్లో ప్రకటించారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందకముందే దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసింది. కానీ అటల్ బిహారీ ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేకపోయింది. సోనియా గాంధీ చొరవతో కాంగ్రెస్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

మన్మోహన్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును 2010లో రాజ్యసభలో ఆమోదించింది. అయితే లోక్‌సభలో మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు నిలిచిపోయింది. ఈ విషయంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయాలు జరిగాయి. అయితే, యూపీఏ కూటమిలోని పార్టీలను ఒప్పించడంలో సోనియా విఫలమయ్యారు. దీంతో ఇది బిల్లుగానే మిగిలిపోయింది. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ ఎన్నికలకు ముందు 160 సీట్లకు పైగా సమీకరణాలు మారే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎంత కీలకం?
ఎన్నికల కమిషన్ 2019 డేటా ప్రకారం, భారతదేశంలోని మొత్తం 91 కోట్ల మంది ఓటర్లలో, మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు 44 కోట్లు. ఇక దీనికి తోడు గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.02 శాతం పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 67.18 శాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు, అరుణాచల్, ఉత్తరాఖండ్, గోవా సహా 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు వేశారు. కాగా బీహార్, ఒడిశా, కర్ణాటకలో మహిళా,పురుషుల ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి.

Asaduddin Owaisi: వీరి నాయకత్వంలో దేశంలో మూడో ఫ్రంట్..: అసదుద్దీన్ ఒవైసీ

ఈ 12 రాష్ట్రాల్లో దాదాపు 200 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తమిళనాడు, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. 2014లో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఆ ఎన్నికల్లో.. పురుషులు 67.09 శాతం ఓటింగులో పాల్గొనగా, మహిళలు 65.63 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే బీహార్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా ఓటేశారు.

2019లో బీజేపీ ఘనవిజయం వెనుక మహిళా ఓటర్లే ​​ప్రధాన పాత్ర పోషించారని అంటుంటారు. CSDS ప్రకారం, 2019లో, బీజేపీకి మొత్తం 37 శాతం ఓట్లు వచ్చాయి. ఇక మహిళా ఓట్ల విషయం చూసుకుంటే.. మొత్తం మహిళా ఓట్లలో 36 శాతం ఓట్లు బీజేపీకే వచ్చాయట. కాంగ్రెస్‌కు 20 శాతం మంది మహిళల మద్దతు మాత్రమే లభించింది. ఇతర పార్టీలకు 44 శాతం మహిళల ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీల్లో తృణమూల్, బిజూ జనతాదళ్, బీఆర్ఎస్, జేడీయూలకు అత్యధికంగా మహిళల ఓట్లు వచ్చాయి.

సభలో మహిళల భాగస్వామ్యం 15 శాతం కంటే తక్కువ
2019 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే. దేశంలోని చట్టసభల్లో మహిళల భాగస్వామ్య పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డిసెంబర్ 2022లో ఒక ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. మహిళల భాగస్వామ్యానికి సంబంధించిన డేటాను సమర్పించారు.

Revanth Reddy : ఎన్నికల్లో గెలిచేందుకు కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం : రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా 19 రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 10 శాతం లోపే ఉందని రిజిజు వెల్లడించారు. ఈ రాష్ట్రాల్లో 200 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీహార్, యూపీ, హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 10 శాతానికి పైగా ఉంది, కానీ అది 15 శాతం కంటే తక్కువ. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం సభలో ఆమోదించాలని, మహిళల భాగస్వామ్యం ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ 2018లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ నరేంద్ర మోదీకి లేఖ రాశారు.