Gossip Garage: బీజేపీలోకి వస్తానంటే వద్దంటున్న నేతలు ఎవరు? ఎందుకు రావొద్దంటున్నారు?
ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ తెలంగాణ పాలిటిక్స్‌లో ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Gossip Garage: అన్నా నమస్తే. కారులో ఉండలేను. కమలం గూటికి రావాలనిపిస్తుంది. మీరు ఒక మాట చెప్తే. అరే ఈడికి వచ్చి ఏం చేస్తవ్ తమ్మి. నాకే టిఖాన గతి లేదు. నువ్వు వచ్చినా టికెట్ దక్కుతదో లేదు. ఇక్కడ కథ అంత గమ్మతి ఉన్నది. వద్దు..రావొద్దు..అని ఓ బీఆర్ఎస్ నేతకు..బీజేపీలో ఉన్న ఓ మాజీ గులాబీ లీడర్ సలహా ఇచ్చారట. అసలు ఏ బీఆర్ఎస్ నేత ఎవరిని సంప్రదించారు? ఆయనెందుకు ఇలా సలహా ఇచ్చారు.?
తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ హీట్ నడుస్తోంది. కాకపోతే ఈసారి సీన్ కాస్త రివర్స్‌లో ఉంది. పవర్‌లో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌లోకి వరుస పెట్టారు నేతలు. గులాబీ పార్టీ ఓడాక అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందంటున్నారు. కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు కమలం పార్టీ వల వేస్తోందట.
దాదాపు పది పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని సంప్రదింపులు జరుపుతోందట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అబ్రహం కారు దిగేశారని అంటున్నారు. ఈ నేతల రూట్‌లోనే కమలం గూటికి చేరాలనుకున్నాడట మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అందుకోసం గతంలో బీఆర్ఎస్‌లో పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతను సంప్రదించారట. అయితే కమలం పార్టీలో ఉన్న ఆ నేత ఇచ్చిన సలహాతో షాక్ అయ్యారట సదరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. దెబ్బకు తన ఆలోచనను మార్చుకుని చివరి శ్వాస వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటానని ప్రకటించారట.
గతంలో బీఆర్ఎస్‌లో పనిచేసి..ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతలు..ఎవరైనా తమ పార్టీలోకి వస్తామంటే వద్దు..రావొద్దు అని సూచిస్తున్నారట. బీజేపీలో పరిస్థితులు అంత బాగా లేవు. తమకే ప్రయారిటీ లేదు. మీరొచ్చి ఏం చేస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఒకరు ఇద్దరు నేతలు అయితే తామే బీఆర్ఎస్‌ను వీడి తప్పు చేశామన్న అభిప్రాయంలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశపడొద్దని చెప్తున్నారట.
తాము ఊహించింది ఒకటి అయితే కమలం పార్టీలో జరుగుతుంది మరొకటని..తమ పార్టీలోకి రావొద్దని సూచిస్తున్నారట. మీరున్న చోటే ఉండండి. ఆ పార్టీనే పవర్‌లోకి వస్తుందని..ఇండైరెక్ట్‌గా మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారమని చెప్పకనే చెప్తున్నారట. బీజేపీలోకి వస్తే రాజకీయంగా ఎదగడం కష్టమని కూడా చెప్తున్నారట. ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న నేతలను తప్ప ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రయారిటీ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
కొత్తగా ఎవరు వచ్చినా పార్టీలో మెలగనివ్వరు..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదని కూడా అలర్ట్ చేస్తున్నారట. కనీసం మీ అనుచరులకు ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు కూడా ఇప్పించుకునే పరిస్థితి ఉండదని..బీజేపీలో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు..తమ పాత మిత్రలు అలర్ట్ చేస్తున్నారట.
బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని..లేకపోతే రాబోయే ఎన్నికల్లోపు బీఆర్ఎస్‌ను మెర్జ్ చేస్తారనే అంచనాతో..కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ముందస్తుగా కమలం గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఓ ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారంటున్నారు. అలాగే ఇంకో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలోకి చేరాలనుకున్నారట. మధ్యవర్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఓ నేతను సంప్రదించారట.
వెంటనే ఆ బీజేపీ నేత తమ పార్టీలోకి రావొద్దని చెప్పేశారట. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారట. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, అందుకే అదే పార్టీలో ఉండు నీకే మంచిదంటూ సలహా ఇచ్చారట సదరు బీజేపీ లీడర్. కమలం పార్టీలో పరిస్థితులు నువ్వు అనుకున్నంత బాలేవు. నేనే ఇరుక్కుపోయా అంటూ ఆవేదన చెప్పుకున్నారట. సదరు బీజేపీ నేత సలహా విని షాకైన ఆ మాజీ ఎమ్మెల్యే, కమలం గూటికి వెళ్లే ఆలోచన మానుకున్నారట.
ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ తెలంగాణ పాలిటిక్స్‌లో ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు బీజేపీకి గూటికి చేరారు. అందులో కొందరు ఎంపీలు అయ్యారు. మరికొందరు బీజేపీలో కీలక నేతలుగా పని చేస్తున్నారు. వాళ్లలో ఎవరు ఈ సలహా ఇచ్చారో క్లారిటీ లేకపోయినా సదరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే జంపింగ్‌కు మాత్రం బ్రేకులు వేశారట. ఈ న్యూస్ ఇప్పుడు అటు బీఆర్ఎస్‌లో..ఇటు బీజేపీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
Also Read: కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి ట్రబుల్ షూటర్.. కీలక బాధ్యత అప్పగించిన గులాబీ బాస్..