Gossip Garage: కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి ట్రబుల్ షూటర్.. కీలక బాధ్యత అప్పగించిన గులాబీ బాస్..

కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్‌పై బాగా వ్యతిరేకత వచ్చిందని..

Gossip Garage: కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి ట్రబుల్ షూటర్.. కీలక బాధ్యత అప్పగించిన గులాబీ బాస్..

Updated On : August 8, 2025 / 9:14 PM IST

Gossip Garage: ఇప్పటికే 10 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. కాస్త సీరియస్‌గా తీసుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందని అలర్ట్ అవుతోందట గులాబీ పార్టీ. వలసలకు బ్రేక్‌ వేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌ రావును రంగంలోకి దింపారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వెంటనే యాక్షన్‌లోకి దిగిన హరీశ్‌రావు.. పార్టీని వీడాలనుకుంటున్న నేతలను బుజ్జగించే పనిలో పడ్డారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి వెళ్లిపోయారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను కమలం ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు కారు దిగేశారు. మరో ఐదారుగురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ వీడటాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదంటున్న బీఆర్ఎస్ నేతలు..మరికొందరు క్యూలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం కలవరపెడుతోందట. మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అందులోనూ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారన్న చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందని, టార్గెట్ బీఆర్ఎస్ నేతలుగా పావులు కదుపుతోందని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది.

పార్టీ నుంచి ఇంకా ఎవరెవరు వెళ్లేందుకు సిద్దమవుతున్నారన్నదానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నారట. ఉమ్మడి జిల్లాల వారిగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల జాబితాను పరిశీలిస్తూ ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది, ఎవరెవరు పార్టీని వీడబోతున్నారనేదానిపై ఆరా తీస్తున్నారట. ఈ క్రమంలోనే వలసలకు బ్రేక్‌ వేసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారట గులాబీ బాస్.

పార్టీ నుంచి జంపింగ్స్‌ను ఆపే బాధ్యతను హరీశ్‌ రావుకు అప్పగించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీని వీడాలనుకుంటున్న వారందరితో చర్చించి నచ్చజెప్పాలని హరీశ్‌రావును ఆదేశించారట కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్‌పై బాగా వ్యతిరేకత వచ్చిందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నేతలకు అర్థమయ్యేలా చెప్పాలని హరీశ్‌రావును రంగంలోకి దింపారట అధినేత కేసీఆర్.

బాస్ కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హరీశ్‌రావు.. మాజీ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లారట. ఎవరెవరైతే జంపింగ్‌ ఆలోచనలో ఉన్నారనే సమాచారం ఉందో.. వాళ్లందరితో ఫోన్‌లో లేకపోతే ప్రత్యక్షంగా కలిసి డిస్కస్ చేస్తున్నారట. ఒక్కో నేతను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారట హరీశ్‌రావు. మరో మూడేళ్లు ఓపిక పడితే అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని నేతలందరికి ధైర్యం నూరిపోస్తున్నారట.

బీఆర్ఎస్‌ను కాదని అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితే బాగాలేదని, వాళ్లనే ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నేతలకు చెబుతున్నారట హరీష్ రావు. బీజేపీలోకి వెళ్లినా..ఇప్పటికే బీఆర్ఎస్‌ నుంచి అక్కడికి వెళ్లిన నేతల సిచ్యువేషన్ ఏంటో మీకే తెలుసని..అన్ని ఆలోచించుకోవాలని సూచిస్తున్నారట. తొమ్మిదిన్నరేళ్లు పదవులు, పరపతి కల్పించిన బీఆర్ఎస్‌ను వీడి వెళ్లవద్దని, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అంతా కేసీఆర్‌కు, పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నారని తెలుస్తోంది. హరీశ్‌ రావు బుజ్జగింపులతో జంపింగ్స్‌కు బ్రేక్‌ పడుతుందా లేదా అనేది చూడాలి.

Also Read: చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు, బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు- రామచంద్రరావు