లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మోడీ పబ్లిసిటీ : ఆర్జీవీ ట్వీట్

  • Published By: chvmurthy ,Published On : February 10, 2019 / 11:53 AM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మోడీ పబ్లిసిటీ : ఆర్జీవీ ట్వీట్

హైదరాబాద్: సినీ ఇండ్రస్టీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తూ, వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ కల్పించుకునే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాణంలో  ఉన్నారు.  లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలతో  తెరకెక్కుతున్న తన సినిమాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కల్పిస్తున్నారని ఆదివారం ఆర్జీవి ట్వీట్ చేశారు. 

ఆర్జీవీ  సినిమాకు మోడీ పబ్లిసిటీ ఏంటా ?  అని  చూస్తే…. గుంటూరు  బీజేపీ సభలో ప్రధాని మోడీ ,చంద్రబాబు నాయుడు పై చేసిన  ” వెన్నుపోటు”  విమర్శల స్పీచ్ ఉన్న వీడియోను పోస్టు  చేశారు ఆర్జీవీ.  ఇప్పటికే లక్ష్మీస్  ఎన్టీఆర్ సినిమా పాటలను విడుదల చేసిన ఆర్జీవీ  టీడీపీ నాయకుల ఆగ్రహానికి గురవుతున్నారు.  ఈ రోజు గుంటూరు లో జరిగిన మోడీ  బహిరంగ సభ విజువల్స్  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కనిపించే అవకాశం లేక పోలేదు . ఈ సినిమా ట్రయిలర్ ను  ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు. 

 

RGV TWEETS

 

Read Also : బాబు దీక్షకి రాహుల్ ఫుల్ సపోర్ట్ : వేదికపై ఇద్దరు నేతల గుసగుసలు

Read Also :  బీజేపీ వల్లే తెలంగాణ వచ్చింది : బాబు దీక్షలో ఆమ్ ఆద్మీ కీలక వ్యాఖ్యలు