సీఎం జగన్ కీలక నిర్ణయం.. వారి కోసం వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్త పథకాలు..!

నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తోంది వైసీపీ అధిష్టానం.

సీఎం జగన్ కీలక నిర్ణయం.. వారి కోసం వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్త పథకాలు..!

YCP Manifesto

Updated On : February 29, 2024 / 3:36 PM IST

YCP Manifesto : నేడు వైసీపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తోంది వైసీపీ అధిష్టానం.

వైసీపీ మ్యానిఫెస్టోకు సంబంధించి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కీలకమైన సమావేశం జరగనుంది. సీఎం జగన్ తో పార్టీలోని కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోను చాలా కీలకంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంది. ముఖ్యంగా నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో పొందుపర్చిన మిగిలిన అంశాలలో 99శాతానికిపైగా అమలు చేశామని వైసీపీ చెబుతోంది. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కొత్తగా మ్యానిఫెస్టోలో ప్రకటించాల్సి ఉంది. పాత మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాటితో పాటు కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ.. చాలా కీలకమైన రైతులు, మహిళలు.. వీరికి ఉపయోగపడే విధంగా కొత్త స్కీమ్ లను మ్యానిఫెస్టోలో చేర్చాలని సీఎం జగన్ యోచిస్తున్నారు.

దీని సాధ్యాసాధ్యాలకు సంబంధించి చాలారోజులుగా వర్కౌట్ కూడా జరుగుతోంది. ఇవాళ్టి సమావేశంలో వీటిపైన కూడా చర్చించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మ్యానిఫెస్టోను ప్రకటించాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. ఇవాళ్టి సమావేశంలో కొత్త పథకాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నవరత్నాలతో పాటు ప్రధానంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీని మేనిఫెస్టోలో చేర్చాలని ఆలోచన చేస్తున్నారు. వీటి అమలు సాధ్యాసాధ్యాలు, ఎంత భారం పడుతుంది వంటి అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక ఇవాళే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?