Mayawati: నేరస్తులకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన బీఎస్పీ చీఫ్ మాయావతి
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్‌పీ నుంచి ఎస్‌పీలోకి వెళ్లారని మాయావతి అన్నారు.

Mayawati
Mayawati: నేరస్తులకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తేల్చి చెప్పారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ భార్య సహిస్ట ప్రవీణ్‌కు టిక్కెట్ విషయంలో వినిపిస్తున్న ఊహాగానాలకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె స్పష్టతనిచ్చారు. అతిక్ భార్య సహిస్టకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ తమ పార్టీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తి లేదని మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్‌పాల్ గత ఫిబ్రవరి 27న ప్రయాగరాజ్‌లో దారుణహత్యకు గురయ్యారు.
Visakha Steel Plant : విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి .. ఏపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
ఇదే ప్రమాదంలో గాయపడిన ఉమేష్‌పాల్ గన్‌మెన్ సైతం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసులో సహిష్ట ప్రవీణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆమెకు టిక్కెట్ ఇచ్చే విషయంపై మాయావతిని మీడియా ప్రశ్నించింది. ఆమెకు తమ పార్టీ టికెట్ ఇవ్దని చెప్తూనే దర్యాప్తులో అతిక్ అహ్మద్ భార్య దోషి అని తేలితే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. ఇక అతిక్ అహ్మద్‌ను సమాజ్‌వాది పార్టీనే పెంచి పోషించిందని మాయావతి విమర్శలు గుప్పించారు.
Karnataka Polls: కర్ణాటకలో ముదిరిన పాల యుద్ధం.. అసెంబ్లీ ఎన్నికలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా?
”లాయర్ ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ కుమారుడు, భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు తెలుస్తోంది. దీనిని బీఎస్‌పీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. కేసు దర్యాప్తులో సహిష్ట ప్రవీణ్ దోషి అని తేలితే ఆమెకు మా పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతాం. ఆమెనే కాదు, నేరస్తులెవరికీ బీఎస్పీలో చోటు ఉండదు” అని మాయావతి తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్‌పీ నుంచి ఎస్‌పీలోకి వెళ్లారని, ఏవో సాకులు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం తగదని అన్నారు. నేరపూరిత శక్తులు ఏ కులానికి, మతానికి చెందిన వారైనప్పటికీ వారిని బీఎస్‌పీ ప్రోత్సహించే ప్రసక్తి లేదని మాయావతి తేల్చి చెప్పారు.