జనసేన మేనిఫెస్టో : భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాటా

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 01:25 PM IST
జనసేన మేనిఫెస్టో : భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాటా

Updated On : March 14, 2019 / 1:25 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రకటించని విధంగా పవన్ హామీలు ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాటా ఇస్తామని పవన్ చెప్పారు.
Read Also : ముఖ్యమంత్రి పదవిపై కోరిక లేదు : పవన్ కళ్యాణ్

పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.8వేలు ఇస్తామన్నారు. రైతు రక్షణ భరోసా పథకం కింద 60ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్ ఇస్తామన్నారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభలో ఎన్నికల మేనిఫెస్టోని పవన్ ప్రకటించారు.

జనసేన మేనిఫెస్టో :

* రైతులకు ఎకరానికి రూ.8వేలు సాగు సాయం
* రైతు రక్షణ భరోసా కింద 60ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్
* ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం
* పరిశ్రమలకు భూములు ఇచ్చేవారికి అందులో భాగస్వామ్యం
* ప్రతి మండలంలో శీతల కేంద్రాలు
* ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్లు
* ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం
* కొత్త రిజర్వాయర్ల నిర్మాణం
* 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* డొక్కా సీతమ్మ క్యాంటీన్లు (విద్యార్థులకు ఉచితంగా తిండి)
* కులాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లింపు
* చిరు వ్యాపారులకు రూ.5వేల రుణ సాయం(పావలా వడ్డీతో)
* ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు
* బీసీలకు 5శాతం రాజకీయ రిజర్వేషన్లు
* కాపులకు రిజర్వేషన్లు
* సామరస్యపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ
* అన్ని కులాలకు కలిపి హాస్టల్స్
* ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెండింతలు
* సచార్ కమిటీ సిఫార్సులు అమలు
* విద్యార్థులకు ఉచిత భోజనం, రవాణ సౌకర్యం
* ఏడాదికి 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
* ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా
* ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రులు
* ఉభయగోదావరి జిల్లాల్లో 5వేల కోట్లతో గ్లోబల్ మార్కెట్
* ఫిషరీస్ డెవలప్ మెంట్ బ్యాక్
* ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు
* బంగారం మీద అర్థ రూపాయి వడ్డీకే రుణ సదుపాయం
* పండుగలకు మహిళలకు చీరల పంపిణీ
* మహిళా బ్యాంకు, మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
* మత్స్యకారులకు మర పడవలు
* డ్వాక్రా మహిళల కోసం బ్యాంకు
Read Also : ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?
Read Also : కడప, పులివెందుల ఎంపీ టికెట్లు బీసీలకు ఇస్తారా : జగన్ కు పవన్ సవాల్
Read Also : అభివృద్ధి చేస్తారనే కొందరి పల్లకీలు మోశాను : పవన్ కళ్యాణ్