మీ దగ్గరున్న రూ.లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారా : చంద్రబాబు చెయ్యని పని మీరు చెయ్యండి

ఏపీ సీఎం జగన్‌ వంద రోజుల పాలనపై జనసేన రిపోర్ట్‌ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను జనసేనాని పవన్ విడుదల చేశారు. ''పారదర్శకత దార్శనికత

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 07:53 AM IST
మీ దగ్గరున్న రూ.లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారా : చంద్రబాబు చెయ్యని పని మీరు చెయ్యండి

Updated On : September 14, 2019 / 7:53 AM IST

ఏపీ సీఎం జగన్‌ వంద రోజుల పాలనపై జనసేన రిపోర్ట్‌ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను జనసేనాని పవన్ విడుదల చేశారు. ”పారదర్శకత దార్శనికత

ఏపీ సీఎం జగన్‌ వంద రోజుల పాలనపై జనసేన రిపోర్ట్‌ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను జనసేనాని పవన్ విడుదల చేశారు. ”పారదర్శకత దార్శనికత లోపించిన వైసీపీ 100 రోజుల పాలన” పేరుతో ఈ బుక్ లెట్ ను తీసుకొచ్చారు. జగన్ పాలనపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయన్నారు. ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం చెప్పినా వినకుండా పీపీఏలు(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) రద్దు చేసి గందరగోళం సృష్టించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రజారోగ్యం పడకేసిందన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని, స్కూల్స్ లో మౌలిక వసతులు లేవని పవన్ అన్నారు. అందరినీ బెదిరిస్తుంటే పెట్టుబడులు ఎవరు పెడతారని పవన్ ప్రశ్నించారు.

ఏపీ రాజధాని అమరావతి మార్పు వార్తలపై పవన్ తీవ్రంగా స్పందించారు. అమరావతిని రాజధాని ప్రాంతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాక ఇంకా డోలాయమానం ఎందుకని పవన్ ప్రశ్నించారు. అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. అమరావతి రాజధానిగా టీడీపీ ప్రభుత్వం గెజిట్ తీసుకురాలేదని చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. టీడీపీ తీసుకురాలేకపోతే మీరు గెజిట్ తీసుకురండి అని జగన్ సర్కార్ కి పవన్ సూచించారు. ఏపీ రాజధానిని మారుస్తామని వైసీపీ నేతలు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజధానిపై ప్రభుత్వం నియమించిన కమిటీపైనా పవన్ స్పందించారు. ఇలా ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని అడిగారు. ఇలా కమిటీలు వేసుకుంటూ పోతే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు ఉంటే సరి చేయాలని ప్రభుత్వానికి సూచించారు పవన్. అమ్మఒడి పథకంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట్లాడితే వైసీపీ వాళ్లు అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తామంటున్నారు.. మరి ఇంట్లో ఒక్క బిడ్డకు ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అని పవన్ అడిగారు. పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ వల్ల కలిగే నష్టాన్ని ఎవరు భరించాలని పవన్ ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక ఈ మూడున్నర నెలల్లో వైసీపీ సాధించింది ప్రజావేదికను కూల్చివేయడం ఒక్కటే అని పవన్ అన్నారు.

ఉన్న పెట్టుబడులను పంపించేస్తే కొత్త వాళ్లు ఎలా వస్తారని పవన్ అడిగారు. కియా కార్ల కంపెనీ ఎండీని బెదిరిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. మీ దగ్గరున్న లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడతారా అని సీఎం జగన్ ని పవన్ ప్రశ్నించారు. మంత్రి బొత్స ఆస్తులను అమ్మి పోలవరాన్ని పూర్తి చేస్తారా అని అడిగారు. కృష్ణా వరదలు వచ్చినప్పడు సీఎం జగన్ అమెరికాలో ఉంటే.. మంత్రులేమో ముంపు బాధితులను పట్టించుకోకుండా చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగారు.. పాలన అంటే ఆకతాయితనంగా ఉందా అని పవన్ సీరియస్ అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా వైసీపీ వంద రోజుల పాలన సాగిందన్నారు.