పార్టీల మైండ్ గేమ్ : రసకందాయంలో ఏపీ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్‌ గేమ్‌ అడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 03:59 PM IST
పార్టీల మైండ్ గేమ్ : రసకందాయంలో ఏపీ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్‌ గేమ్‌ అడుతున్నాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్‌ గేమ్‌ అడుతున్నాయి. నేతల పేర్లు లీక్‌ చేయడం, వారితో సంప్రదింపులు జరపడం, నేడో రేపో పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం చేయడమే కాక.. పరస్పర ఆకర్ష్ మంత్రాలతో పార్టీల్లోకి నేతల వలసలు జోరందుకున్నాయి. టీడీపీ, వైసీపీల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. సర్వేల పేరిట నేతలకు వల వేస్తున్నాయి. వారి బలాబలాలపై అపనమ్మకం కల్గించేలా ప్రచారాలు పెంచేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో .. జనంలో సానుకూలత కోసం పాట్లు పడుతున్నాయి. మరి ఏపార్టీ అంచనాలు అనుకూలిస్తాయి.. ఏపార్టీ అంచనాలు తలకిందులవుతాయి..

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊహకందని ఈ మలుపులు అందర్నీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్, మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖజిల్లా భీమిలి నుంచి, మరో మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు పార్లమెంట్ నుంచి బరిలో దింపడానికి అధిష్టానం సిద్ధమవ్వడంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. టీడీపీలో టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహాం దంపతులు, పారిశ్రామికవేత్త  పొట్లూరి వరప్రసాద్, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మెట్టు గోవిందరెడ్డి .. ఆ పార్టీని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరారు. అమలాపురం ఎంపీగా పండుల రవీంద్ర టికెట్ ఆశించి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అయితే తీరా అక్కడ స్థానంలేదని టీడీపీలోకి వెళ్లాలని భావిస్తుంటే .. సీఎం నిరాకరించారనే వార్తలు విన్పిస్తున్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి దంపతులు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ టీడీపీని వీడి వైకాపాలో చేరారు. 

ఎంతోకాలంగా ఉత్కంఠ రేపిన పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. నిన్నటివరకు లోకేష్ విశాఖపట్నం నుంచి పోటీచేస్తారని భావించారు. అందరి అంచనాలను తారుమారుచేస్తూ రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీ చేయడానికి లోకేష్‌కు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ముందు కృష్ణాజిల్లా పెనమలూరు, గుడివాడ, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. విశాఖజిల్లా భీమిలి నుంచి పోటీచేస్తారన్నా వార్తలూ వచ్చాయి. వీటన్నిటికీ తెరదించుతూ మంగళగిరి సీటును లోకేష్‌కు ఖరారు చేశారు.

వైసీపీలోను అమోమయ పరిస్థితులే నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన దాసరి జైరమేష్ టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పుడు .. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఎన్నికల్లో పోటీచేయనని, వైసీపీ తరపున ప్రచారం చేస్తానని నిర్ణయించుకోవడంతో పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ను తెరపైకి తెచ్చారు. దాసరి జైరమేష్ రాజ్యసభ సభ్యత్వం ఇస్తాననే హామీతో పీవీపీని విజయవాడ ఎంపీ బరిలోకి దింపారు. తోట నరసింహాకు కాకినాడ ఎంపీ స్థానాన్ని కేటాయిస్తారని చెబుతున్నారు. ఆయన సతీమణికి జగ్గంపేట స్థానం కోసం పట్టుబడుతున్నారు. జగ్గంపేటలో వైసీపీలో గెలిచిన జ్యోతుల నెహ్రూ, ప్రధాన అనుచరుడైన పారిశ్రామికవేత్త అత్తలూరి నాగబాబు, జానపరెడ్డి సుబ్బారావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబులు పోటీపడుత్నారు. వీరిలో ఎవరికి సీటు కేటాయిస్తారనేది అయోమయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే పలు నియోజకవర్గాలున్నాయి.