కరోనా టైంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల లిస్ట్ విడుదల చేసిన రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : July 21, 2020 / 09:37 PM IST
కరోనా టైంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల లిస్ట్ విడుదల చేసిన రాహుల్

Updated On : July 21, 2020 / 10:39 PM IST

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ సాధించిన అద్భుత విజయాలు ఇవేనంటూ ఆయన అందులో పేర్కొన్నారు.

రాజస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం గురుంచి కూడా రాహుల్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. కరోనా కష్టాల్లో దేశం కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోడీ మాత్రం రాజకీయాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టారంటూ సెటైరికల్‌గా ఆ ట్వీట్ చేశారు. . ప్రధాని మోడీ వైఫల్యం వల్లే కరోనా విజృంభణలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని విరుచుకుపడ్డారు.

మంగళవారం(జులై-21,2020) రాహుల్ చేసిన ఆ ట్వీట్‌ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ తన ట్వీట్ లో ఈ విధంగా తెలిపారు …కరోనా వైరస్‌ విజృంభణ వేళ మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు.. ఫిబ్రవరి- హలో ట్రంప్‌, మార్చి- మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూల్చివేత, ఏప్రిల్‌- కరోనాపై కట్టడికి కొవ్వొత్తుల్ని వెలిగించడం, మే- మోడీ సర్కార్‌కు ఆరో వార్షికోత్సవం, జూన్‌- బీహార్‌లో వర్చువల్‌ ర్యాలీ, జులై- రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) సాధించింది అని రాహుల్ ట్వీట్ చేశారు.

మరోవైపు, రాహుల్ గాంధీ ట్వీట్ పైబీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందంటూ ప్రశ్నిస్తున్నారు. గత 6 నెలల్లో – ఫిబ్రవరి: షాహీన్ బాగ్ ఘటన మరియు ఢిల్లీ హింసాత్మక అల్లర్లు, మార్చి: జ్యోతిరాదిత్య సింధియా మరియు ఎంపిలను కోల్పోవడం, ఏప్రిల్: వలస కార్మికులను ప్రేరేపించడం మే: కాంగ్రెస్ చారిత్రాత్మక ఓటమికి 6 వ వార్షికోత్సవం జూన్: డిఫెండింగ్ చైనా, జూలై : రాజస్థాన్‌లో కాంగ్రెస్ వర్చువల్ పతనం అంటూ రాహుల్ కు కౌంటర్ ఇస్తూ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలని బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. దీనిపై ఇరు పార్టీల మధ్య ఇప్పుడు ట్విటర్ వార్ కొనసాగుతోంది.