Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన రాహుల్.. ఈసారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?

భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన రాహుల్.. ఈసారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?

Updated On : August 8, 2023 / 7:25 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ రెండో దశను ప్రకటించారు. గుజరాత్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వరకు సాగనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇక రాహుల్ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా మహారాష్ట్రలోని పార్టీ నేతలు సమాంతర పాదయాత్ర నిర్వహిస్తారని ఆయన చెప్పారు.

Rajasthan: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం.. మహిళలపై వేధింపులకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగం ఫట్

పటోలే మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ దశ గుజరాత్ నుంచి మేఘాలయ వరకు ఉంటుంది. పశ్చిమ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు నాయకత్వం వహిస్తారు’’ అని తెలిపారు. తొలి విడత యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్లు నడిచింది. అయితే ఇది ముగిసిన చాలా రోజులకు రాహుల్ యాత్ర ప్రారంభించారు.

Shrikant Shinde: అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుండగా పార్లమెంటులోనే హనుమాన్ చాలీసా చదివిన సీఎం షిండే తనయుడు

భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. అయితే రెండవ యాత్రకు సంబంధించిన తేదీలు సహా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పాదయాత్ర అనంతరం మహారాష్ట్ర అంతటా బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని పటోలే తెలిపారు. ఈ యాత్రలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. సభలతో పాటు ప్రజలతో మాట్లాడనున్నారు.