స్పీకర్‌గా పోచారం నామినేషన్: డిప్యూటీ స్పీకర్‌ ఎవరికో?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ సభాపతి ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా.. స్పీకర్ గా పోచారం పేరు ఖరారు చేసినట్టు వార్తలు వినిపించాయి.

  • Published By: sreehari ,Published On : January 17, 2019 / 09:19 AM IST
స్పీకర్‌గా పోచారం నామినేషన్: డిప్యూటీ స్పీకర్‌ ఎవరికో?

Updated On : January 17, 2019 / 9:19 AM IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ సభాపతి ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా.. స్పీకర్ గా పోచారం పేరు ఖరారు చేసినట్టు వార్తలు వినిపించాయి.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ సభాపతి ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా.. స్పీకర్ గా పోచారం పేరు ఖరారు చేసినట్టు వార్తలు వినిపించాయి. తెలంగాణ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేయడంతో దాదాపు ఆయనే స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సభాపతిగా పోచారం పేరు ఖరారు కాగా.. ఇక మిగిలింది డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఉప సభాపతిపైనే అందరి దృష్టి పడింది. అయితే ముందు నుంచి డిప్యూటీ స్పీకర్ గా రేఖా నాయక్ పేరు వినిపిస్తోంది. రేఖా నాయక్ పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రేఖా నాయక్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయిన పక్షంలో డిప్యూటీ స్పీకర్ గా రేఖా నాయక్ పేరు కూడా ఖరారు అవుతుందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున రెండోసారి ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రేఖా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవిని రేఖా నాయక్ కు కట్టబెట్టేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎస్టీ కోటాలో రేఖా నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదన్ రెడ్డి వ్యవహరించగా.. ఉప సభాపతిగా పద్మా దేవేందర్ రెడ్డి వ్యవహరించారు.