Lalu Yadav Birthday: లాలూ ప్రసాద్ యాదవ్ 76వ పుట్టినరోజు సందర్భంగా 76 కిలోల లడ్డూతో సర్‭ప్రైజ్ చేసిన కార్యకర్తలు

లాలూ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఆర్జేడీ నుంచే కాకుండా జేడీయూ నుంచి కూడా అనేక మంది నేతలు ఇంటికి వచ్చి మరీ లాలూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్రసాద్‌కు స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు మిఠాయిలను బహూకరించారు

Lalu Yadav Birthday: లాలూ ప్రసాద్ యాదవ్ 76వ పుట్టినరోజు సందర్భంగా 76 కిలోల లడ్డూతో సర్‭ప్రైజ్ చేసిన కార్యకర్తలు

Updated On : June 13, 2023 / 3:32 PM IST

76 kg Laddoo: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 76వ పుట్టినరోజు ఈరోజు. ఆదివారం కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ తన పుట్టినరోజు చేసుకున్నారు లాలూ యాదవ్. ఈ వేడుకల్లో భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వీ యాదవ్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే లాలూ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సర్‭ప్రైజ్ బహుమతి ఇచ్చారు. 76వ పుట్టినరోజును పురస్కరించుకుని 76 కిలోల భారీ లడ్డూతో వేడుకలు నిర్వహించారు.

Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యపై ఖలిస్తానీలు నిర్వహించిన పరేడ్‭లో తప్పేం లేదట.. కెనడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వివాదాదస్పద వ్యాఖ్యలు

ఇక లాలూ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఆర్జేడీ నుంచే కాకుండా జేడీయూ నుంచి కూడా అనేక మంది నేతలు ఇంటికి వచ్చి మరీ లాలూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్రసాద్‌కు స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు మిఠాయిలను బహూకరించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఫోన్‌లో లాలూతో మాట్లాడి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.


ఇక ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల గురించి తేజశ్వీ యాదవ్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ చేస్తున్న లాలూ ఉన్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన తేజశ్వీ యాదవ్.. ‘‘దేశ విదేశాల్లో బీహార్‌కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన గౌరవనీయమైన లాలూ ప్రసాద్ యాదవ్ గారు సామాజిక న్యాయానికి మార్గదర్శకుడు, దృఢమైన వ్యక్తిత్వం కలిగిన సంపన్నుడైన గౌరవనీయ లాలూ ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు. మరియు జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.