Sanjay Raut: బీజేపీ వల్లే అల్లర్లు.. బెంగాల్, బిహార్ అల్లర్లపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
శ్రీరామ నవమి శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ముగిశాయి. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలు లక్షంగా మరో విడత అల్లర్లు జరగవచ్చనే భయాలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వ్యక్తం చేశారు. పండుగ ముగిసిన ఐదు రోజుల తర్వాత కూడా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఊరేగింపులు తీశారని, ఆయుధాలు, బాంబులను ఊరేగింపుల్లోకి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.

Sanjay Raut
Sanjay Raut: పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండ వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనే అల్లర్లు చెలరేగాయని ఆయన అన్నారు. బీహార్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఆదివారం చేసిన వ్యాఖ్యలపైనా రౌత్ మండిపడ్డారు. అధికారం కోసమే బీజేపీ ఇలా చేస్తోందని విమర్శించారు.
SCs and STs: ఎస్సీ, ఎస్టీల మానవాభివృద్ధి సూచీలో మెరుగుదల.. వెల్లడించిన కేంద్రం
ఈ విషయమై మంగళవారం మీడియాతో రౌత్ మాట్లాడుతూ ”తాజా అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉంది. 2024 ఎన్నికల్లో ఎక్కడతై బీజేపీ ఓటమి చవి చూసి, ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆయా ప్రాంతాల్లోనే అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలోకి ఉన్నప్పుడు అంతవరకూ ఆగడం ఎందుకు?” అని రౌత్ నిలదీశారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకాల క్యాలెండర్ 2023-24 విడుదల.. ఏయే నెలలో ఏయే సంక్షేమ పథకాలో తెలుసా?
శ్రీరామ నవమి శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ముగిశాయి. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలు లక్షంగా మరో విడత అల్లర్లు జరగవచ్చనే భయాలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వ్యక్తం చేశారు. పండుగ ముగిసిన ఐదు రోజుల తర్వాత కూడా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఊరేగింపులు తీశారని, ఆయుధాలు, బాంబులను ఊరేగింపుల్లోకి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.
”ఒకరోజు పండుగను ఐదు రోజులు ఎందుకు కొనసాగించారు? పండుగ రోజు ఉత్సవాలకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయుధాలతో ఊరేగింపుల్లో పాల్గొనకూడదు. పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపులు జరపరాదు. ఇందుకు భిన్నంగా ఎందుకు జరిగింది? రామనవమి అల్లర్లు, దహనకాండల వెనుక బీజేపీ హస్తం ఉంది” అని మమతా బెనర్జీ అన్నారు.