Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకాల క్యాలెండర్‌ 2023-24 విడుదల.. ఏయే నెలలో ఏయే సంక్షేమ పథకాలో తెలుసా?

ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఏపీ సర్కారు తెలిపింది. జగనన్న వసతి దీవెన నుంచి ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాల వరకు వివరాలు చూద్దాం.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకాల క్యాలెండర్‌ 2023-24 విడుదల.. ఏయే నెలలో ఏయే సంక్షేమ పథకాలో తెలుసా?

Ap CM Jagan

Updated On : April 4, 2023 / 7:47 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023-24ను సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ అమరావతిలో ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏడాది పొడవునా ఏయే నెలలో ఏయే సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ముందుగానే ప్రకటిస్తున్నామని తెలిపారు.

క్యాలెండర్‌ 2023-24 వివరాలు

ఏప్రిల్‌ 2023-జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మే 2023–వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కల్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా

జూన్‌ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కల్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)

ఆగస్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర

సెప్టెంబర్‌ 2023 – వైఎస్సార్‌ చేయూత

అక్టోబర్‌ 2023 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)

నవంబర్‌ 2023 – వైఎస్సార్‌ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్‌ కల్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)

డిసెంబర్‌ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జనవరి 2024 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)

ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కల్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు

SCs and STs: ఎస్సీ, ఎస్టీల మానవాభివృద్ధి సూచీలో మెరుగుదల.. వెల్లడించిన కేంద్రం