Cong President Poll: అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి.. కాంగ్రెస్‭పై విమర్శలు గుప్పించిన శశి థరూర్

నేను మిస్త్రీని నిందించడం లేదు. అయితే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. 22 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరగలేదు. మల్లికార్జున ఖర్గేకు మద్దతివ్వడానికి అనేక మంది పీసీసీ అధ్యక్షులు, నేతలు వచ్చారు. నా అభ్యర్థిత్వం విషయంలో అలా జరగడం లేదు. నేను వెళ్లినపుడు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. సమాన అవకాశాలు ఉన్న బరి ఉండి ఉంటే ఏం జరిగి ఉండేది? నేను ఫిర్యాదు చేయడం లేదు. కానీ నాతో ఖర్గేతో వ్యవహరిస్తున్న తీరులో తేడా కనిపిస్తోంది కదా..?

Cong President Poll: అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి.. కాంగ్రెస్‭పై విమర్శలు గుప్పించిన శశి థరూర్

Shashi Tharoor Points To Difference In Treatment

Updated On : October 13, 2022 / 6:45 PM IST

Cong President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి శశి థరూర్ సంచలన ఆరోపణ చేశారు. అభ్యర్థులకు సమాన అవకాశాలు లేని ఎన్నికల బరి ఇది అని పేర్కొన్నారు. అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని, అభ్యర్థుల పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు సరైన విధంగా లేదని ఆరోపించారు. రాష్ట్రీల పీసీసీలు ఖర్గేను ఆహ్వానిస్తున్నారు కానీ, తనను ఎవరూ ఆహ్వానించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక రకమైన పక్షపాతం ఉద్దేశ పూర్వకంగానే చూపుతున్నారంటూ ఆయన పరోక్షంగా కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు.

ఈ ఎన్నికల్లో శశి థరూర్, మల్లికార్జున ఖర్గే పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 9,000 మంది పీసీసీ డెలిగేట్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు. ఓట్ల లెక్కింపు ఈ నెల 19న జరుగుతుంది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీ ఈ నెల 12న మాట్లాడుతూ, రహస్య బ్యాలట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు ఓటు వేసేటపుడు భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ తెలియదని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు లభించాయో కూడా తెలియదని చెప్పారు. సమాన అవకాశాలతో పోటీ ఉంటుందని భరోసా ఇచ్చారు.

అయితే శశి థరూర్ గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘నేను మిస్త్రీని నిందించడం లేదు. అయితే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. 22 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరగలేదు. మల్లికార్జున ఖర్గేకు మద్దతివ్వడానికి అనేక మంది పీసీసీ అధ్యక్షులు, నేతలు వచ్చారు. నా అభ్యర్థిత్వం విషయంలో అలా జరగడం లేదు. నేను వెళ్లినపుడు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. సమాన అవకాశాలు ఉన్న బరి ఉండి ఉంటే ఏం జరిగి ఉండేది? నేను ఫిర్యాదు చేయడం లేదు. కానీ నాతో ఖర్గేతో వ్యవహరిస్తున్న తీరులో తేడా కనిపిస్తోంది కదా..?’’ అని ప్రశ్నించారు.

Lottery: అప్పుల్లో కూరుకుపోయి, బ్యాంకు నోటీసు వచ్చిన కొద్ది సమయానికే భారీ లాటరీ తగిలింది