RGVకి జగన్ ఎలా మద్దతిస్తారు : యామిని

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మకు మద్దతు తెలపటంపై టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్, ప్రతిపక్షనేత రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు ఆర్జీవి కి మద్దతు తెలపటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి, నీటి ఎద్దడి అంశాలు ఉన్నాయి, పక్క రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటి గురించి జగన్ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు.
ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి.వాటి పై ప్రజలకు భరోసా ఇవ్వకుండా ఒక సైకోకు మద్దతు తెలపటం ఎంతవరకు సమంజసం అని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక టూరిస్ట్‌లా ఏపీకి వచ్చిపోతుంటారని ఆమె అన్నారు. జగన్ ను అడ్డం పెట్టుకుని మోడీ ఏపీలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని యామిని మండి పడ్డారు. ఇప్పటి కైనా ప్రతిపక్షనేతగా జగన్ ప్రజల సమస్యలపై స్పందించాలని ఆమె హితవు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో సమస్యలపై స్పందించలేని ప్రతిపక్ష నేత బూతు డైరెక్టర్ పై స్పందించటం సిగ్గుచేటని మరో టీడీపీ నాయకురాలు సినీ నటి దివ్యవాణి అన్నారు. ఆర్జీవి కి జగన్ ఇంట్లో జరిగిన హత్యారాజకీయాలపై సినిమా తీసే దమ్ముందా అని ఆమె అన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల సమస్య తీవ్ర రూపం దాలిస్తే దానిపై స్పందించకుండా బుతు డైరెక్టర్ ప్రెస్ మీట్ విజయవాడలో అడ్డుకున్న అంశంపై స్పందించడాన్ని ఏమనాలో అర్ధం కావటం లేదని దివ్యవాణి అన్నారు.