గడ్కరీ దగ్గర చంద్రబాబుకి అవమానం : ఎమ్మెల్యే బొల్లినేని ఆడియో లీక్
నెల్లూరు : ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ఆడియో టేప్‌లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపైనే ఆయన కొన్ని ఇబ్బందికర

నెల్లూరు : ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ఆడియో టేప్‌లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపైనే ఆయన కొన్ని ఇబ్బందికర
నెల్లూరు : ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ఆడియో టేప్‌లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపైనే ఆయన కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే సమయంలో చంద్రబాబుకు అవమానం జరిగిందని.. అదే సమయంలో గడ్కరీ వద్దే ఉన్న తాను మాట్లాడి చంద్రబాబును శాంతింపజేశానని బొల్లినేని అన్నారు. అసలు.. టీడీపీకి తానే ఒక పెద్ద ఆస్తి అని.. పార్టీ నుంచి మాత్రం తాను ఎటువంటి లాభం పొందలేదని అన్నారు.
అటు.. పార్టీ నాయకులు, అధికారులపైనా బొల్లినేని తీవ్ర విమర్శలు చేశారు. ఓసారి జాయింట్ కలెక్టర్‌తో వివాదం తలెత్తినప్పుడు తన తప్పు లేకపోయినా చంద్రబాబు వల్ల అధికారికి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. అదే.. వైఎస్ అయితే.. అధికారికి గట్టిగా ఇచ్చేవాడని కామెంట్ చేశారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి, ఆదాల మధ్య సమన్వయం లేదని.. ఒకరితో మాట్లాడితే మరొకరు సహించలేరంటూ బొల్లినేని మాట్లాడటం ఆడియో టేప్‌లో ఉంది. ఈ మాటలు బొల్లినేని ఎప్పుడు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు రికార్డు చేశారు.. అనే వివరాలేవీ తెలియదు. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో మాత్రం ఈ ఆడియో టేప్ హాట్ టాపిక్‌గా మారింది. అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.