టీడీపీలో సీటుపై ఫైటింగ్ : రాయపాటి రాజీనామా అంటూ ప్రచారం

ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.

  • Published By: madhu ,Published On : March 14, 2019 / 07:39 AM IST
టీడీపీలో సీటుపై ఫైటింగ్ : రాయపాటి రాజీనామా అంటూ ప్రచారం

Updated On : March 14, 2019 / 7:39 AM IST

ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.

ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీడీపీ అధిష్టానంపై రాయపాటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంపీ సీటు కేటాయించకపోయినా..కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఏపీ సీఎం బాబును కోరుతున్నారు. ఈ విషయంలో బాబు ఎలాంటి వైఖరి కనబర్చకపోవడంతో రాయపాటి అలకబూనారు. 
Read Also : హెలికాప్టర్ రెడీ : జగన్ సుడిగాలి ప్రచారం

మార్చి 14వ తేదీ గురువారం ముఖ్య అనుచరులతో రాయపాటి భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే దానిపై చర్చిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్టానం పెద్దలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోడెల పోటీ పై సందిగ్ధం కొనసాగుతోంది. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించినా..ఆయన మాత్రం సత్తెనపల్లి అసెంబ్లీ బరిలో ఉంటానని చెబుతున్నారు. ఇక్కడి నుండి ఎవరు పోటీ చేస్తారో తెలియక తెలుగు తమ్ముళ్లు అయోమయంలో మునిగిపోయారు. 

ఏపీ అసెంబ్లీ, ఎంపీ సీట్ల విషయంలో టీడీపీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడుతున్న పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే ఒక నియోజకవర్గం కాకుండా మరొక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి రాయపాటిని టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. 
Read Also : కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే