అధ్యక్షా : మార్చి 06న టి.అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్షిక బడ్జెట్ ఉండడంతో సమావేశాలు జరపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. 2020, మార్చి 06వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 25వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్చి 06వ తేదీన ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం తొలిసారి కావడం గమనార్హం.
మరుసటి రోజు అంటే..మార్చి 07వ తేదీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దానిపై చర్చ ప్రారంభం కానుంది. మార్చి 08 ఆదివారం సెలవు. మార్చి 09వ తేదీ సోమవారం హోళీ పండుగ కూడా సెలవు. మార్చి 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్‌పై అధ్యయనం చేయడానికి ఒక రోజు సభకు విరామం ఇస్తారు.
ఇక శాసనసమండలి విషయానికి వస్తే..కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. మార్చి 06వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న క్రమంలో..తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కసరత్తులు జరుపుతున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఏ శాఖకు ఎంత కేటాయించాలి, వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.
Read More : జేబుకు చిల్లు : ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు