Congress Second List : ఏ క్షణమైనా కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల..! ఎంపీ అభ్యర్థులు వీళ్లే? ఆ 4 చోట్ల ఇంకా తేలని పంచాయితీ

నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది.

Congress Second List : ఏ క్షణమైనా కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల..! ఎంపీ అభ్యర్థులు వీళ్లే? ఆ 4 చోట్ల ఇంకా తేలని పంచాయితీ

Updated On : March 19, 2024 / 8:12 PM IST

Congress Second List : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఏఐసీసీ. మరో 9మంది అభ్యర్థులతో రెండో జాబితాను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ కానుంది. సెకండ్ లిస్ట్ లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి షెహనాజ్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి పేర్లు కన్ ఫర్మ్ అయ్యాయి.

భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించనుంది కాంగ్రెస్. ఇక నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది.

Also Read : కేంద్రంలో అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక హామీలు