అనంతలో ఉద్రిక్తత : మంత్రి కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్ల దాడి

అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు,

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 01:40 PM IST
అనంతలో ఉద్రిక్తత : మంత్రి కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్ల దాడి

Updated On : February 3, 2019 / 1:40 PM IST

అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు,

అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. అలర్ట్ అయిన పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం మంత్రి తన కార్యక్రమాన్ని ముగించుకుని గ్రామం నుంచి వెళ్లిపోయారురు.

 

పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత తోపుదుర్తి గ్రామానికి వెళ్లారు. అయితే మంత్రిని గ్రామంలోని మహిళలు అడ్డుకున్నారు. మంత్రిని తమ గ్రామంలోకి రానివ్వమని చెప్పారు. ఈ ఐదేళ్లలో మంత్రి పరిటాల సునీత తమ గ్రామానికి చేసిందేమీ లేదని మహిళలు ఆరోపించారు. 500మంది మహిళలు రోడెక్కి ఆందోళనకు దిగారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన 10వేల రూపాయలు ఇంతవరకు తమకు అందలేదని మహిళలు ఆరోపించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. మంత్రి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు మంత్రి కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు, చీపుర్లు విసిరి తమ నిరసన తెలిపారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత మంత్రి యథావిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. తోపుదుర్తి వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి స్వగ్రామం.