Women Height Increased: మోదీ ప్రభుత్వంలో జరిగిన అద్భుతం.. మహిళలు ఎత్తు పెరుగుతున్నారట!
మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ మహిళల ఎత్తు పెరిగిందని హర్యాన మంత్రి ఓ బహిరంగ కార్యక్రమంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు ఎత్తు పెరగాడానికి ఆయన అద్భుతమైన కారణాన్ని చెప్పారు

Omprakash Dhankad: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 9 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఈ ప్రచారం ద్వారా జరుగుతోంది. ఉజ్వల యోజన నుంచి పెద్ద నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వరకు ఆర్థికాభివృద్ధి వరకు అన్నింటిని హైలైట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు.
India-China Relations: చైనా-భారత్ సరిహద్దు పరిస్థితిపై భారత్ వైఖరి స్పష్టం చేసిన ప్రధాని మోదీ
అయితే వీటన్నిటినీ వదిలేసి ఇంకేదో చెప్పాలన్న ఆరాటంలో బీజేపీకి చెందిన ఒక నేత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకులో పెట్టాయి. మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ మహిళల ఎత్తు పెరిగిందని హర్యాన మంత్రి ఓ బహిరంగ కార్యక్రమంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు ఎత్తు పెరగాడానికి ఆయన అద్భుతమైన కారణాన్ని చెప్పారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, ఉపాధి కల్పించడంతో మహిళలు ఎత్తు పెరుగుతున్నారన్నది ఆయన సమాధానం.
New Height like no one can even IMAGINE
👇🤣👇😝👇🤯👇🤔👇
“The height of women increased in Modi govt; the height of my own sisters increased by two inches”
OP Dhankhar,
BJP State President, Haryana pic.twitter.com/L6YBnJPDcz— Sachin (@Sachin54620442) June 19, 2023
అసలు ఆయన ఏం చెప్పారు?
బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు ఓంప్రకాశ్ ధన్‌ఖడ్ పన్నప్రముఖ్ సమావేశంలో మాట్లాడుతూ ‘‘మోదీ ప్రభుత్వ హయాంలో నా సోదరి 2 అంగుళాల ఎత్తు పెరిగింది. ఒక్క నా సోదరే కాదు, దేశంలోని మహిళలందరికీ ఇదే జరిగింది’’ అని ధనఖడ్ అన్నారు. ఇంతకుముందు మహిళలు నీళ్ళు, పేడ తలపై పెట్టుకుని తిరిగేవారు కదా.. అలా వాళ్లు పొట్టిగా ఉండేవారట. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇంటింటికీ గ్యాస్, తాగునీరు అందించడంతో మహిళలకు నెత్తిపై బరువులు తగ్గి ఎత్తు పెరుగుతున్నారట.
Maharashtra Politics: బీజేపీలో చేరనున్న ఎన్సీపీ చీఫ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత
మంత్రి ధన్‌ఖడ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నెటిజెన్లు ఈ వీడియోను చేస్తూ మంత్రి ధన్‌ఖడ్ మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.