Minister Sridhar Babu : చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది.. 3 బిల్లులను ఆమోదించాం : మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించినట్టు అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ఆమోదించామని ఆయన చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం మూడు కీలక బిల్లులను ఆమోదించినట్టు వెల్లడించారు.

Minister Sridhar Babu : చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది.. 3 బిల్లులను ఆమోదించాం : మంత్రి శ్రీధర్ బాబు

Three Bills Passed over Telangana Assembly Sessions

Minister Sridhar Babu : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చరిత్రలో నిలిచే ఘట్టం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించినట్టు అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ఆమోదించామని ఆయన చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం మూడు కీలక బిల్లులను ఆమోదించినట్టు వెల్లడించారు. శనివారం (ఫిబ్రవరి 17) తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో నీటిపారుదలశాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపై చర్చ జరిపింది. అనంతరం స్పీకర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.

Read Also : Pawan Kalyan Vizag Tour : విశాఖలో రెండు రోజుల పవన్ పర్యటన ఖరారు

ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. కులగణన చేపట్టి సంఖ్యాపరంగా అవకాశాలు కల్పించే బాధ్యతను తీసుకున్నామని ఆయన చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టామని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశాలపై సభలో చర్చించినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

అధికార పార్టీతో సమానంగా బీఆర్ఎస్‌కు సమయం ఇచ్చాం :
శాసనసభ మొత్తం 45 గంటల 32 నిమిషాల పాటు జరిగిందన్నారు. 64 మంది ఎమ్మేల్యేలు జీరో అవర్‌‌లో మాట్లాడగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 గంటల 43 నిమిషాలు మాట్లాడారన్నారు. అదేవిధంగా 8 గంటల 41 నిమిషాలు బీఆర్ఎస్ నేతలకూడా సమానంగా సమయం కేటాయించినట్టు చెప్పారు. సీపీఐ ఎమ్మెల్యేకు 2 గంటల పాటు మాట్లాడేందుకు సమయం ఇచ్చినట్టు తెలిపారు.

అదేవిధంగా, కృష్ణ నది జలాల నీటి వాటలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీల కుల గణన, కాళేశ్వరం లాంటి అంశాలపై సభలో చర్చించామన్నారు. ప్రతిపక్షాల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపారు. శాసనమండలి కూడా 6 రోజుల పాటు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించగా.. మొత్తం మండలి 11.5 నిమిషాలు నడిచిందన్నారు.

మండలిలో కూడా 19 మంది నేతలు మాట్లాడినట్టు చెప్పారు. చర్చ సమయంలో ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసినా నిర్మాణాత్మకంగా వ్యవహరించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వంకు సూచనలు, సలహాలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజలను పక్క దారి పక్క పట్టివ్వడనికి ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నం చేశాయని దుయ్యబట్టారు.

రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశాం :
గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన నష్టాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించామన్నారు. కాగ్ రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుంది.. ఎవరిది సత్యం ఎవరిది అసత్యం అనేది అర్థం అవుతుందన్నారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని, ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పామన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేస్తున్నామని తెలిపారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోర్టును కోరామన్నారు. మేడిగడ్డకు ఎందుకు బీటలు పడిందో బీఆర్ఎస్ నేతలు చూసి సమాధానం చెప్పాలన్నారు. రూ. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ పథకం అమలుపై ప్రక్రియ కొనసాగుతుందని, ఈలోపు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకపోతే మరి కొన్ని పథకాలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Read Also : HarishRao Comments : ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకనే కాళేశ్వరం పేరిట గారడీలు : హరీష్ రావు మండిపాటు