రిటర్న్ : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 29న ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత రాంమాధవ్ ను కలిసిన జితేందర్ రెడ్డి.. బీజేపీలో చేరికపై చర్చలు జరిపారు. తనను ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని కోరినట్టు సమాచారం. జితేందర్ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించడం లేదు.
జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ పై మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించారు. సీఎం కేసీఆర్ జితేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదనే ఆరోపణలతో జితేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి.. పార్టీ మారే యోచనలో ఉన్నారు. బీజేపీలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు టికెట్ దక్కని కారణంగా మళ్లీ బీజేపీలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.