Shah and Nitish: నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు.

2024 Elections: విపక్షాల ఇండియా కూటమి నుంచి అనక మంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారు. అందులో ఒకరు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇండియా కూటమిలో ఒక అవగాహన రాలేదు. దీనికి తోడు విపక్షం విమర్శలు. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అది కూడా నితీశ్ కుమార్ ను ఉద్దేశించే. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ‘మేరీ మతి మేరా దేశ్’ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్‌లో పర్యటిస్తున్నారు.
శనివారం (సెప్టెంబర్ 16) రాష్ట్రంలోని మధుబని నుంచి ఆయన మరోసారి ‘భారత్’ కూటమిని టార్గెట్ చేశారు. ఈ కూటమిలో భాగమైన మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ కూటమి స్వార్థ కూటమని, లాలూ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని, నితీశ్ ప్రతిసారీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అయితే ఆ అదృష్టం నితీశ్ కు లేదని, ఎందుకంటే ప్రధానమంత్రి పదవి ఖాళీ లేదని, నరేంద్ర మోదీయే మరోసారి ప్రధాని అవుతారంటూ అమిత్ షా అన్నారు.
Modi Birthday: తల్లిలేకుండా జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు.. 72 ఏళ్లపాటు హీరాబెన్ మోదీతో..
ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు. 2019లో 53 శాతం ఓట్లు, 39 సీట్లు ఇచ్చి మోదీని ప్రధానిని చేశారని, 2024లో కూడా ఇదే రిపీట్ అవుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.