బిజీ బాబు: కోహ్లీ ఓటు వేయలేడంట

బిజీ బాబు: కోహ్లీ ఓటు వేయలేడంట

Updated On : April 27, 2019 / 12:08 PM IST

సోషల్ మీడియాలో బీభత్సంగా హల్‌చల్ సృష్టించి పెద్ద ఎత్తున ఓటేయాలంటూ నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. దానికోసం సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు కూడా ప్రచారం చేయాలంటూ బాధ్యతలు అప్పగించారు. వారిలో ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందువరుసలో నిలిచాడు. 

కానీ, అంత పెద్ద బాధ్యతలు మోసిన కోహ్లీకే ఓటు వేయడానికి లేదంట. ప్రభుత్వం ముందు అందరూ సమానులే అని మరోసారి రుజువైంది. తన భార్యతో పాటుగా ముంబైలోని ఓర్లీ ప్రాంతం నుంచి ఓటేయాలని కోహ్లీ అనుకున్నాడట. ఆ కారణంతోనే ఎలక్షన్ కమిషన్‌కు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 

అప్పటికే గడువు పూర్తి అయింది. మార్చి 30నాటికి చేరాల్సిన అప్లికేషన్ గడువు పూర్తయ్యాక చేరడంతో తామేం చేయలేమంటూ ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. సంబంధిత అధికారి మాట్లాడుతూ.. ‘కోహ్లీ అప్లికేషన్‌ను పక్కన ఉంచాం. ఎలాగైనా అదే స్థానం నుంచి ఓటు వేసేలా ఏర్పాటు చేయడాలని తన టీం చాలా సార్లు ప్రయత్నించింది. అప్పటికే గడువు పూర్తయిపోవడంతో ఏం చేయలేకపోయాం’ అని అధికారి తెలిపారు. 

‘ధోనీ.. కోహ్లీ.. రోహిత్ శర్మలను ట్యాగ్ చేస్తూ..క్రికెట్ ఫీల్డ్‌లో రికార్డులు సృష్టించి 130కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. మీరంతా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తే అధిక శాతం ఓటింగ్ నమోదవుతుంది’ అని మోడీ అధికారిక ట్వీట్ ద్వారా పోస్టు చేశాడు.