వివేక్ వర్సెస్ వెంకటేశ్ : పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యింది. ముగ్గురు సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి మరో ఛాన్స్ ఇవ్వలేదు. 8మంది సిట్టింగ్ లకు రెండోసారి టికెట్ ఇచ్చారు. అలాగే నలుగురు కొత్త ముఖాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు – హర్షకుమార్
పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ వివేక్, వెంకటేశ్ నేతకాని పెద్దపల్లి ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. వెంకటేశ్ నేతకాని గురువారం(మార్చి 21, 2019) టీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేశారు. వివేక్, వెంకటేశ్ మధ్య టఫ్ ఫైట్ ఉంది.
ఈ ఇద్దరిలో కేసీఆర్ పెద్దపల్లి టికెట్ ఎవరికి ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది. మాజీ ఎంపీ వివేక్ కు సీటు ఇవ్వొద్దని పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కోరుతున్నారు. వెంకటేశ్ కే టికెట్ ఇవ్వాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. మరి కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 16 సీట్లు గెలవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకుని గెలిచే వారికే టికెట్లు ఇచ్చారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
Read Also : మెగా బ్రదర్స్ గట్టెక్కేనా : వెస్ట్ గోదావరి ఎందుకు ?