Bihar: నితీశ్ హయాంలోనే జైలుకు వెళ్లిన అతడు, నితీశ్ హయాంలోనే ఎందుకు విడుదలయ్యాడు?
కాలేజీ నుంచి డ్రాపౌట్ అయిన ఆనంద్ మోహన్.. జైలు నుంచి పలు పుస్తకాలు రాశారు. ఆయన జైలు నుంచే ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు, మాఫియాను నడిపిస్తున్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ చీఫ్ లాలన్ సింగ్ సహా మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు

Nitish Kumar and Anand mohan
Bihar: ఈ ఏడాది జనవరిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఆధ్వర్యంలో పాట్నాలో రాజ్‌పుత్ సదస్సును నిర్వహించారు. నితీశ్ కుమార్ సదస్సుకు వస్తుండగా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త ఆనంద్ మోహన్ మద్దతుదారుల నుంచి ‘ఆనంద్ మోహన్ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి నితీష్ సమాధానమిస్తూ “మీరు అతని గురించి చింతించకండి, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను” అన్నారు. ఇది జరిగిన మూడు నెలలకు ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని హత్య చేసి జైలుకు వెళ్లిన గ్యాంగ్‌స్టర్ కమ్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలపై బిహార్‌లో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జైలుకు వెళ్లిన ఆనంద్ మోహన్ మళ్లీ నితీశ్ హయాంలోనే విడుదలయ్యారు. అయితే అతడు విడుదల కావడానికి నితీశ్ ప్రభుత్వం ఏకంగా చట్ట సవరణ చేయడం పొలిటికల్ కాంట్రవర్సీకి తావునిచ్చింది. 2021 మార్చిలో కనీసం అతడి శిక్ష తగ్గించాలన్ని డిమాండును కూడా నితీశ్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా విడుదల చేసేందుకే సిద్ధమై, అన్నంత పనీ చేశారు.
సోమవారం పాట్నాలో జరిగిన తన కుమారుడి నిశ్చితార్థానికి కోర్టు నుంచి బెయిల్ తీసుకుని హాజరయ్యారు ఆనంద్ మోహాన్. ఆ కార్యక్రమంలో ఉండగానే ఆయనకు బెయిల్ లభించినట్లు వార్త అందింది. ఇంతకు ఎవరీ ఆనంద్ మోహాన్? తన హయాంలోనే జైలు పాలైన వ్యక్తిని, శిక్ష తగ్గించడానికి కూడా ఒప్పుకోని నితీశ్ కుమార్.. ఎందుకు చట్ట సవరణ చేసి మరీ విడుదల చేశారు? ఇప్పుడు నితీశ్ కుమార్‌కు ఆయనతో వచ్చిన అంత అవసరం ఏంటి? ఈ ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తనది ‘సుసాషన్ పాలన’ (నేర రహిత, అత్యుత్తమ పాలన) అని చెప్పుకుంటున్న నితీశ్ కుమార్ ప్రభుత్వం 2012 నాటి చట్టంలోని 481 నియమానికి ఏప్రిల్ 10న మార్పులు చేసింది. 481వ నిబంధన ప్రకారం.. ప్రభుత్వ అధికారులను హత్య చేసిన కేసుల్లో దోషులుగా తేలితే సత్ప్రవర్తన ఉన్నప్పటికీ విడుదలకు అనర్హులు. దాన్నే నితీశ్ ప్రభుత్వం మార్చింది.
ఆనంద్ మోహన్ ఎవరు?
బీహార్ పీపుల్స్ పార్టీ (ప్రస్తుతం ఉనికిలో లేదు) వ్యవస్థాపకుడు అయిన ఆనంద్ మోహన్.. పెద్ద డాన్. డాన్ అయిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో చేరి ఎంపీ అయ్యారు. అయితే ఆనంద్ మోహన్‌కు సంబంధించిన ఒక గుంపు 1995ల్ దళిత సమాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన జి.కృష్ణయ్య(35)ను కారులో ప్రయాణిస్తుండగా.. కారును పల్టీ కొట్టించి, కారు నుంచి బయటకు లాగి కొట్టి చంపారు. ఈయన తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. భూమిలేని నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయనను.. రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపారు.
MCD Polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం.. బలం చాలక వెనక్కి తగ్గిన బీజేపీ
అప్పటికే అనేక సంవత్సరాలుగా అనేక తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలి జైలు జీవితం గడుపుతున్న ఆనంద్ మోహన్ (తోమార్ రాజ్‌పుత్ సామాజికవర్గం), 1996లో ఆర్జేడీ తరపున బీహార్‌లోని సియోహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక జి.కృష్ణయ్య హత్య కేసులో 2007లో పాట్నా హైకోర్టు మరణశిక్ష విధించింది. స్వాతంత్ర్యం అనంతరం మరణశిక్షను ఎదుర్కొన్న మొదటి రాజకీయ నాయకుడు ఆనంద్ మోహనే. అంతే కాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోయారు. అయితే ఈ శిక్షను 2008లో కఠిన జీవిత ఖైదుగా తగ్గించారు. నేరం రుజువైన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన ఆనంద్ మోహన్.. జైలులో నుంచే అతని పరాక్రమాన్ని చూపించాడు. 2010 బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా తన భార్య లవ్లీ ఆనంద్ పోటీకి దింపారు. అయితే ఈయనకు రాబిన్ హుడ్ ఇమేజ్ కూడా ఉందని కొందరు అంటారు.
నితీశ్ కుమార్‌కి ఇప్పటికిప్పుడు ఆనంద్ మోహన్ అవసరం ఎందుకు వచ్చింది?
కాలేజీ నుంచి డ్రాపౌట్ అయిన ఆనంద్ మోహన్.. జైలు నుంచి పలు పుస్తకాలు రాశారు. ఆయన జైలు నుంచే ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు, మాఫియాను నడిపిస్తున్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ చీఫ్ లాలన్ సింగ్ సహా మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, కొత్తగా మార్చిన చట్ట సవరణను జైలు నుంచి విడుదలైన ఆనంద్ మోహన్ ప్రస్తావిస్తూ సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయవచ్చని, తన విషయంలో కూడా అదే జరిగిందని నొక్కి చెప్పారు. “నన్ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న వారు కోర్టును ఆశ్రయించవచ్చు. దానిని వ్యతిరేకించే వారు చట్టబద్ధమైన పాలనను అగౌరవపరుస్తున్నారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Karnataka Polls: అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక ప్రభుత్వానికి బిగ్ షాకిచ్చిన సుప్రీం
ఆనంద్ మోహాన్ భార్య, కుమారుడు ఇద్దరు ఆర్జేడీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు. ఈ పార్టీతో నితీశ్ పొత్తులో ఉన్నారు. బిహార్‌లో వరుస ప్రాభవాన్ని కోల్పోతున్న నితీశ్.. ఇంతకు ముందు బీజేపీ హిందుత్వ వల్ల లాభపడ్డారు. బీజేపీ హిందుత్వ రాజకీయాల వల్ల రాజకీయంలో కులం పట్టింపు తక్కువగా కనిపించింది. అయితే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంతో మళ్లీ కుల రాజకీయాలే ప్రధానమయ్యాయి. నితీశ్ సొంత కులమైన కుర్మీలు, ఓబీసీలు రాష్ట్రంలో కేవలం ఐదు శాతం మాత్రమే. ఈ కులం వారు విద్యావంతులు, ఉద్యోగులు, భూమి, డబ్బు ఎక్కువగానే ఉన్నవారు. వీరు ఓబీసీలైనప్పటికీ తమను తాము ఆధిపత్య వర్గం వారిగా భావిస్తారు. తమను ఆధిపత్య వర్గంతో చూసుకోవడంలో బీజేపీ బాగా సహకరిస్తుండడంతో కొంత కాలంగా బీజేపీకి బాగా దగ్గర అయ్యారు.
ఇక మిగిలిన ఓబీసీలు నితీశ్‌కు ఎప్పుడో దూరం జరిగారు. యాదవులు, సహా ఇతర ఓబీసీలు నితీశ్ నితీశ్ కంటే తేజస్వీ యాదవ్‌ను నాయకుడిగా చూస్తున్నారు. ఇదే సమయంలో నితీశ్ సన్నిహితుడు, తన కులస్థుడే అయిన ఉపేంద్ర కుష్వాహా జేడీయూని వీడి సొంత పార్టీ పెడతానని ప్రకటన చేయడం నితీశ్ కుమార్‌కు మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలో ఏఐఎంఐఎం బలం పుంజుకోవడంతో ముస్లింలు ఓవైసీ వైపు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. వీటికి తోడు ఆర్జేడీ నేతలు సమయం దొరికినప్పుడల్లా నితీశ్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు ఓట్ బ్యాంక్ పెంచుకోవడంతో పాటు, ఆర్జేడీని కూడా చల్లబర్చేందుకు నితీశ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆనంద్ మోహాన్ సహాయం కావాల్సి వచ్చింది.
Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ .. గులాబీ గూటిలో కీలక బాధ్యతలు
బీహార్‌లో రాజకీయంగా కీలకమైన మిథిలాంచల్ ప్రాంతంలో ఆనంద్ మోహన్‌కు గట్టి పట్టు ఉంది. పైగా అక్కడ మెజారిటీ ఆ సామాజిక వర్గానిదే. ఆనంద్ మోహాన్ను కనుక బయటికి తీసుకువస్తే అటు రాజ్‌పుత్‌లు కీలకమైన నియోజకవర్గానికి పెద్ద సందేశం వెళ్తుంది. ఆర్జేడీ శాంతించి నితీశ్‌తో సానుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్రంలో రాజ్‌పుత్‌ల ఓట్ బ్యాంక్ 12 శాతం. అంతకు ముందు ఆర్జేడీ, జేడీయూతో రాజ్‌పుత్‌లు చాలా మందే ఉండేవారు. అయితే 2014లో మోదీ వచ్చిన అనంతరం క్రమంగా బీజేపీ వైపుకు వెళ్లడం ప్రారంభించారు. అయితే ఆనంద్ మోహన్‌ను కనుక తమ వైపు ఉన్నాడని సందేశం పంపితే వాళ్లు ఇటు వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇన్ని కారణాల దృష్ట్యా, రాజకీయ ప్రకంపనలు లేస్తాయనే విషయం తెలిసి కూడా ఆనంద్ మోహన్ విడుదలకు నితీశ్ సాహసించారని విశ్లేషకులు అంటున్నారు.