America President Elections: అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్, బైడెన్‭లకు షాక్.. రెండోసారి పోటీకి ఈ ఇద్దరూ వద్దంటున్న అమెరికన్లు

బైడెన్ పనితీరు పట్ల కేవలం 41 శాతం మంది మాత్రమే సముఖత వ్యక్తం చేశారు. జనవరి 2021లో ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి అధిక ద్రవ్యోల్బణం, ఇతర కారణాలు అమెరికాను ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ అమెరికన్లు ట్రంప్ లేదంటే బైడెన్.. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిందే.

America President Elections: అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్, బైడెన్‭లకు షాక్.. రెండోసారి పోటీకి ఈ ఇద్దరూ వద్దంటున్న అమెరికన్లు

Biden and Trump

America Presedent Eelctions: మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవకాశం ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే తన పోటీని ధ్రువీకరించారు. అంతే కాకుండా, రిపబ్లికన్ పార్టీతో పాటు ఆ పార్టీ మద్దతుదారులను, సంప్రదాయవాద అమెరికన్లను ఆయన తనవైపుకు తిప్పుకునే పనిలో ప్రతికూల ఫలితాలే సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ కూడా వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా వీరిద్దరే ప్రధాన అభ్యర్థులుగా పోటీకి దిగారు.

Delhi Public School : ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు .. తనిఖీలు నిర్వహించిన పోలీసులు

అయితే ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సముఖంగా లేరట. రాయిటర్స్-ఇప్సోస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‭లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బైడెన్ విషయంలో ఎక్కువ మంది బైడెన్ వయసు పెరగడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా.. ట్రంప్ విషయంలో ఆయన వివాదాస్పద వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం అమెరికన్ల ఓటర్ల నుంచి వస్తున్న అభిప్రాయాలే కాదు. ఇరు నేతల పార్టీల్లోని అభ్యర్థులు వెల్డిస్తున్న అభిప్రాయాలు కూడా.

Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్

సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది డెమొక్రాటిక్ ప్రతివాదులు బైడెన్ రెండవసారి పదవిని కోరకూడదని తెల్చి చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీ ప్రతివాదుల్లో 34 శాతం మంది ట్రంప్ మళ్లీ పోటీ చేయకూడదని చెప్పారు. డెమొక్రాట్‌లలో 61 శాతం మంది బైడెన్ చాలా పెద్ద వాడని, వయసు మీద పడ్డదని అన్నారు. ప్రస్తుతం బైడెన్ వయసు 80 ఏళ్లు. ఇక ట్రంప్ విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే బైడెన్‭తో పోల్చినప్పుడు ఈ అభిప్రాయాలు చాలా తక్కువ స్థాయిలో వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ వయసు 76 ఏళ్లు.

Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ .. గులాబీ గూటిలో కీలక బాధ్యతలు

మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో బైడెన్ పనితీరు పట్ల కేవలం 41 శాతం మంది మాత్రమే సముఖత వ్యక్తం చేశారు. జనవరి 2021లో ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి అధిక ద్రవ్యోల్బణం, ఇతర కారణాలు అమెరికాను ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ అమెరికన్లు ట్రంప్ లేదంటే బైడెన్.. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిందే. ఎన్‌బిసి న్యూస్ నిర్వహించిన సర్వేలో డెమొక్రాట్ పార్టీ నుంచి బైడెన్‭కు 88 శాతం మద్దతు లభించింది. అంతే కాకుండా 83 శాతం మంది ప్రస్తుతం అతని ఉద్యోగ పనితీరును అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

James Gunn : ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉంది.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

ఇక 2020 ఎన్నికలలో బిడెన్‌ చేతిలో ఓటమితో పాటు తాజా నేరారోపణలు ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ట్రంపుకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. ఆ పార్టీలోని 46 శాతం మంది ట్రంప్ తమ మొదటి ఎంపికగా పేర్కొన్నారు. ట్రంప్‌పై అంతగా ఇష్టపడని చాలా మంది రిపబ్లికన్లు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నారు.