Delhi Public School : ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు .. తనిఖీలు నిర్వహించిన పోలీసులు

సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ రాజేష్ డియో మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఎలాంటి అనుమానపు వస్తువు కనిపించలేదని చెప్పారు.

Delhi Public School : ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు .. తనిఖీలు నిర్వహించిన పోలీసులు

Delhi Public School

Delhi Public School: మథుర రోడ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్ ద్వారా సమాచారం రావడంతో క్యాంపస్‌లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల ఆవరణంనుంచి బయటకు తీసుకొచ్చేందుకు పాఠశాల వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్వాట్ టీమ్స్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. పాఠశాల భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, పాఠశాల ఆవరణలో ఎలాంటి అనుమానపు వస్తువు దొరకలేదని పోలీసులు తెలిపారు.

Chandrababu : మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు

ఈ విషయంపై సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ రాజేష్ డియో మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఎలాంటి అనుమానపు వస్తువు కనిపించలేదని చెప్పారు. అయితే. ఢిల్లీ పోలీసుల బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్, డాగ్ బృందం ప్రస్తుతం పాఠశాల భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయని తెలిపారు.

Covid -19 Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

ఇదిలాఉంటే ఢిల్లీలోని ఇండియన్ స్కూల్‌కు గతంలోకూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీలోని సాధిక్ నగర్‌లో ఉన్న ఇండియన్ స్కూల్‌కు ఏప్రిల్ 12న బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో ఖాళీ చేయించారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ పాఠశాలకు చేరుకొని పాఠశాల ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.