పవన్ తో దోస్తీ అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమే

ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజేపీ అందుకు సిధ్దమైతే మాకేం నష్టం లేదని ఘాటుగా విమర్శించారు. బిజేపి,జనసేన పార్టీలు రెండు గత ఎన్నికల్లో పోటీ చేసి పొందిన ఫలితాలు చూశామని… రెండు పార్టీలు ఓట్లని, సీట్లని ప్రభావితం చేయలేని పార్టీలు అని ఆయన అన్నారు.
రాజకీయ కూటములు రాజకీయాల్లో సర్వసాధారణం అని.. ఎన్నికల సమయంలో ఇది సాధారణం…ఇప్పుడు వీరి కలయికపై మేము స్పందించాలి అనుకోవట్లేదని రాంబాబు చెప్పారు. కాకపోతే రెండు పార్టీల వారు ఈరోజు చేసిన ఆరోపణల్లో… 7 మాసాల్లో ఈ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. రాజకీయాల్లో, వ్యక్తిగతంగా స్థిరత్వంలేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. ఆయన ఒక్కో లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివితే ఒక్కో విధంగా భావజాలం అనిపిస్తోంది. మరి ఆయనకు ఒక్కో విధంగా అనిపించడంలో తప్పు లేదు.
పాచిపోయిన లడ్డు అని మోడీపై ధ్వజమెత్తిన ఈయనకు ఇవాళ జీడిపప్పు,కిస్ మిస్ తో మోడీ ఫ్రెష్ లడ్టూలు పంపారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే ఆయన హోదా అడక్కుండా బీజేపీతో బేషరతుగా ఎందుకు కలసి పనిచేస్తానని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు.
హోదా విషయం వైయస్సార్ కాంగ్రెస్ ను అడగమంటున్నాడు ….మోడీతో కలిసిన నువ్వు ఏమి చేస్తావ్….మీరు బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశారు…ఆ తర్వాత టీడీపీ తో దూరంగా ఉన్నట్లు నటించారు….వామపక్షాలతో కలిశారు….రాజకీయ స్థిరత్వం లేని మీరు ఒక పార్టీతో దీర్ఘ కాలం ఉన్నారా, ప్రభుత్వ విఫలం కానీ, సఫలం కానీ అనేది 7 నెలల్లో నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు.
సీఎం గా జగన్ పదవి చేపట్టిన ఈ 7 నెల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం…అదే మా వైఫల్యమా…అలా విమర్శించడం విజ్ఞత కాదని చెబుతున్నాను. మీరు కలవాలంటే కలవండి..ఎన్ని పార్టీలు కలిసినా మేము భయపడం…ఒంటరిగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చాం..చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం….దేశంలో అవినీతిపై పోరాటం చేస్తున్న వ్యక్తి జగన్…ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సాయం చేయడానికి మీ కూటమి పెట్టారా అని పవన్ ను ప్రశ్నించారు.
గతంలో ఎన్నో కూటములు పెట్టారు…అయినా మాకు ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా మీకు జగనే టార్గెట్ . చంద్రబాబు- సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్ళని బీజేపీలోకి పంపారు..ఇప్పుడు మీరు బీజేపీతో కలిశారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్.
వామ పక్షాలకు మీరు బాకీ కాదు… అంటున్నారు. చంద్రబాబుకు బాకీ ఉన్నారా..? వామ పక్షాలు కూడా ఈయన నిలకడలేని వ్యవహారాన్ని గమనించాలి అని అంబటి హితవు పలికారు. సిద్ధాంతాలు లేక పీఆర్పీ లా జనసేన కూడా కాలగర్భంలో లిసిపోతుందని రాంబాబు జోస్యం చెప్పారు.