వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు : 14  రోజుల రిమాండ్ 

  • Published By: chvmurthy ,Published On : March 9, 2019 / 11:06 AM IST
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు : 14  రోజుల రిమాండ్ 

నెల్లూరు: పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో అరెస్టైన నెల్లూరు రూరల్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి జిల్లా కోర్టు ఈనెల 23 వరకు 14 రోజుల రిమాండ్  విధించింది.  వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్రెడ్డి నెల్లూరు వైసీపీ ఆఫీసు ముందు  శనివారం దీక్షకు దిగారు. దీంతో కోటంరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, అక్కడ పార్టీ కార్యకర్తలు, పోలీసులుకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది.
గురువారం అర్ధరాత్రి ఆయన వేదాయపాలెం పోలీసుస్టేషన్కు తన అనుచరులతో వెళ్లి  వైసీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని సీఐ  నరసింహా రావుతో వాగ్వివాదానికి దిగారు. దీంతో వేదాయపాలెం పోలీసుస్టేషన్లో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.