ఉద్యమాన్ని అణచాలని చూస్తే బలంగా ఆందోళనలు చేస్తారు : పవన్ కళ్యాణ్

  • Published By: chvmurthy ,Published On : January 7, 2020 / 11:34 AM IST
ఉద్యమాన్ని అణచాలని చూస్తే బలంగా ఆందోళనలు చేస్తారు : పవన్ కళ్యాణ్

Updated On : January 7, 2020 / 11:34 AM IST

ఏపీ రాజధాని ప్రాంత రైతులు మంగళవారం తలపెట్టిన  రహదారుల దిగ్బంధం తో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా విపక్ష టీడీపీతో పాటు జనసేన పార్టీ నాయకులను కూడా గృహ నిర్భంధం చేశారు. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద  రైతులపై పోలీసుల తీరును పార్టీ చీఫ్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఖండించారు. 

రాజధానిరైతులు ప్రజాస్వామ్య పధ్ధతిలో  శాంతియుతంగా  నిరసన తెలియచేస్తుంటే  ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా  వ్యవహరిస్తోందని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. ఇలాంటి చర్యలతో  ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందని పవన కళ్యాణ్ అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించి  భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ వాసులు కూడా పరిపాలనా రాజధాని  విషయంలో సంతృప్తిగా కనిపించటంలేదని…. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటు తనం ఉందని ఆయన వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల  అభివృధ్ధిపై ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికలు లేవని అన్నారు.  

“రాయలసీమ  వాసులు రాజధాని విశాఖకు వెళ్లాలంటే దూరాభారమవుతుందని వారి అభిప్రాయలను ప్రభుత్వం పట్టించుకోవటంలేదని పేర్కోన్నారు. రాజధాని మార్పు అనేది ఉద్యోగులకీ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోంది.హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడిప్పుడే కుదురుకొంటున్నారు. 
తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు.వాళ్ళను మళ్ళీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలుకి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతాయి.అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోంది.ఎవరికీ సంతృప్తి కలిగించటం లేదని” పవన కళ్యాణ్ అన్నారు.

Also Read : ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధ ఎండీపై దాడి

“తాము భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉంచాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారు..రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దంపట్టింది…వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలి” అని పవన్ కళ్యాణ్ సూచించారు.