వివేకా హత్య కేసు : ఎంపీగా గెలిచేందుకే చంపేశారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసు దర్యాఫ్తు తీరుపై వివేకా కూతరు సునీతారెడ్డి మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. కడపలో తన తండ్రి వివేకా కీలక

వివేకా హత్య కేసు : ఎంపీగా గెలిచేందుకే చంపేశారు

Updated On : April 10, 2024 / 12:44 PM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసు దర్యాఫ్తు తీరుపై వివేకా కూతరు సునీతారెడ్డి మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. కడపలో తన తండ్రి వివేకా కీలక

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసు దర్యాఫ్తు తీరుపై వివేకా కూతరు సునీతారెడ్డి మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. కడపలో తన తండ్రి వివేకా కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో.. రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే హత్య చేశారని సునీతారెడ్డి ఆరోపించారు. ఎంపీగా గెలిచేందుకే వివేకా హత్యకు మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యూహం రచించారని సందేహం వ్యక్తం చేశారు. నాన్న దగ్గర ఉన్న వారందరిని సిట్ అధికారులు విచారిస్తున్నారన్న సునీతారెడ్డి.. టీడీపీ వాళ్లను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. 
Read Also : 20రోజులు ఓపిక పడితే : మనందరి ప్రభుత్వం వస్తుంది

సీఎం చంద్రబాబు.. మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని సునీతారెడ్డి నిలదీశారు. తన తండ్రి హత్య జరిగి 10 రోజులు అవుతున్నా కారణాలు ఎందుకు బయటపడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యలో పరమేశ్వర రెడ్డి పాత్ర ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన రోజే పరమేశ్వరరెడ్డి ఆస్పత్రిలో చేరారని, ఆ సాయంత్రమే హరితా హోటల్ లో టీడీపీ కార్యకర్తలను కలిశారని సునీతారెడ్డి చెప్పారు.

సీఎం చంద్రబాబు తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సునీతారెడ్డి ప్రశ్నించారు. నాన్న చనిపోయారని బాధపడుతుంటే అది మీరే చేశారనడం కరెక్టేనా? అని అడిగారు. సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం ఏం సభ్యతా అని వాపోయారు.
Read Also : కుట్ర రాజకీయాలు కాకపోతే ఏంటీ : బదిలీలపై ఆగ్రహం