వైసీపీ దూకుడు.. ఎన్నికలకు 50 రోజుల ముందే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు

మేుము సిద్ధం- మా బూత్ కమిటీలు సిద్ధం అనే నినాదంతో ముందుకెళ్తోంది వైసీపీ. ఎన్నికలకు దాదాపు 50 రోజుల ముందే బూత్ కమిటీలు పూర్తి చేశారు.

వైసీపీ దూకుడు.. ఎన్నికలకు 50 రోజుల ముందే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు

YSRCP Polling Booth

Updated On : February 21, 2024 / 8:05 PM IST

YSRCP Polling Booth : పోలింగ్ బూత్ కమిటీల నియామకాన్ని వైసీపీ పూర్తి చేసింది. ప్రతీ వార్డుకు ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 15మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47వేల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది వైసీపీ. మేుము సిద్ధం- మా బూత్ కమిటీలు సిద్ధం అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఎన్నికలకు దాదాపు 50 రోజుల ముందే బూత్ కమిటీలు పూర్తి చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది.

ఎన్నికల సమరానికి అధికార వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అన్ని విషయాల్లో ప్రత్యర్థులకన్నా ముందు ఉంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలకన్నా ముందుంది. ఇప్పుడు పోలింగ్ బూత్ ల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలతో పోల్చి చూస్తే అధికార వైసీపీ ఒక మెట్టు ముందు ఉంది.

Also Read: పొత్తుల విషయంలో ఎంతో నలిగిపోయాను, వాళ్లతో ఎన్నో తిట్లు తిన్నాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు