పొత్తుల విషయంలో ఎంతో నలిగిపోయాను, వాళ్లతో ఎన్నో తిట్లు తిన్నాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

కష్టాల్లో ఉన్న టీడీపీకి చేయి అందించి పైకి తీసుకొచ్చాం. ఇంత ధైర్యం ఉన్నా, ఎన్నికలు చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెచ్చే కెపాసిటీ లేదు.

పొత్తుల విషయంలో ఎంతో నలిగిపోయాను, వాళ్లతో ఎన్నో తిట్లు తిన్నాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan Sensational Comments

Updated On : February 21, 2024 / 6:10 PM IST

Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని జగన్ అనుకుంటే, తిరిగి ఆయన ఇంట్లోనే అది జరిగిందన్నారు పవన్ కల్యాణ్. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తి, మనకెలా ఇస్తాడు? అని పవన్ నిలదీశారు. జగన్.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. సమాజంలో సుస్థిరత కోల్పోయేలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల ఓ కులంపై చెడు ముద్ర వేశారని వాపోయారు.

భీమవరం వైసీపీ ఎమ్మెల్యేతో నాకు శత్రుత్వం ఏమీ లేదన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రతిపాదన రాష్ట్ర బాగు కోసమే అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. జాతీయ నాయకుల వద్ద ఎన్నో చీవాట్లు తిని పొత్తు కోసం పోరాడానని పవన్ తెలిపారు. కొన్ని ఇబ్బందులు, త్యాగాలు తప్పవన్న పవన్.. త్యాగం చేసిన వారికి గుర్తింపు పక్కా అని హామీ ఇచ్చారు.

”గత ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేయమని నాతో చెప్పిన సన్నిహితులు ఇప్పుడు ఇక్కడ లేరు. ఎన్నికల్లో భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే జనసేన పోటీలో ఉండడమే కారణం. జగన్ సిద్ధం అంటే మేము యుద్ధం అంటాము. వైజాగ్ లో, ఏపీ బోర్డర్ లో నన్ను ఆపాలని చూస్తే నా సత్తా చూపిస్తా” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజవర్గ జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల పరిస్థితులు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ”ఓట్లు కొనాలా లేదా అనేది నేను ఎవరికీ చెప్పను. ఓట్లు కొనే పరిస్థితి లేకపోవడమే సంతోషకరం. పదేళ్ల తర్వాత అయినా సరే డబ్బుతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇక, వైసీపీలో తనను తిట్టే కొంతమంది నాయకులకు పవన్ సమాధానం ఇచ్చారు. మీరెన్ని తిట్టినా నేను భయపడను, వెనక్కు తగ్గను అని పవన్ అన్నారు. ”కష్టాల్లో ఉన్న టీడీపీకి చేయి అందించి పైకి తీసుకొచ్చాం. ఇంత ధైర్యం ఉన్నా, ఎన్నికలు చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెచ్చే కెపాసిటీ లేదు.
ఈసారి మాత్రం గెలవడం ప్రామాణికంగా తీసుకుంటున్నా. ఉమ్మడిగా వచ్చాక ఏ వైసీపీ శక్తులు మనల్ని ఆపలేవు. నేను ఒక్కడినే అయిపోయాను, మాట్లాడేందుకు టైమ్ సరిపోవట్లేదు. భీమవరం రావాలని ఉన్నా, అన్ని చోట్లా తిరుగుతున్నా. ఉమ్మడి ప్రభుత్వం రాగానే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేస్తాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కల్యాణ్ కామెంట్స్..
* రాజకీయాల్లోకి కొత్త తరం నాయకులు రావాలి
* కులాలను విడగొట్టే వాళ్లు కాదు కులాలను కలుపుకుని అభివృద్థి పథంవైపు తీసుకెళ్లే వాళ్లు కావాలి
* అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను అక్కున చేర్చుకుంటా
* రాష్ట్ర భవిష్యత్తుకు యువకులే నాయకులు
* డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజూ చెప్పలేదు
* కనీసం భోజనాలు కూడా పెట్టకుండా రాజకీయం చేసేద్దాం అంటే కుదరదు
* డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే
* ఓట్లు కొనాలా? లేదా? అనేది నేను చెప్పను
* డబ్బుతో ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి, అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది
* ఏపీని కాపాడుకునేందుకే పొత్తులు
* ఓట్ల చీలకుండా ఉండేలా చూసేందుకు ఎంత నలిగిపోయానో నా ఒక్కడికే తెలుసు
* జాతీయ నాయకుల దగ్గర ఎన్నో తిట్లు తిన్నాను
* రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం
* జనసేన ప్రయోజనాల కోసం నేను ఎన్నడూ ఆలోచన చేయలేదు
* ఏపీ ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత కోసమే నిత్యం ఆలోచన చేశాను

Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?