టెక్సాస్‌లో 90అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా? వీడియో వైరల్

టెక్సాస్ లోని 90 అడుగుల హనుమంతుని విగ్రహం యూఎస్ లో ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది. యూఎస్ వ్యాప్తంగా ఇది ..

టెక్సాస్‌లో 90అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా? వీడియో వైరల్

90 Feet Hanuman Statue in USA

90 Feat Hanuman Statue in USA : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈనెల 18న విగ్రహాన్ని ప్రారంభించారు. హోస్టన్ నగరంలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఈ ఆంజయనే స్వామి 90 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు.

Also Read : Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జైషా..! గ్రెగ్ బార్‌క్లే పదవి నుంచి తప్పుకోవటంతో లైన్ క్లియర్

ముఖ్యఅతిథిగా చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహం ఆవిష్కరణ సమయంలో హెలికాప్టర్ తో విగ్రహంపై పూలవర్షం కురిపించారు. జై వీర హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది. పెద్ద సంఖ్యలో అమెరికాలోని హిందువులు పాల్గొన్నారు.

టెక్సాస్ లోని 90 అడుగుల హనుమంతుని విగ్రహం యూఎస్ లో ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది. యూఎస్ వ్యాప్తంగా ఇది మూడవ ఎత్తయిన విగ్రహంగా నిలిచింది. అదేవిధంగా ఉత్తర అమెరికాలోని ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. ఇదిలాఉంటే 2020లో డెలావేర్‌లో 25 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం తెలంగాణలోని వరంగల్ నుండి రవాణా చేయబడింది.