శ్రీశైలంలో మరో వివాదం : అన్యమత ప్రచారం
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వరుసగా వివాదాలు చేటుచేసుకుంటున్నాయి.
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వరుసగా వివాదాలు చేటుచేసుకుంటున్నాయి.
కర్నూలు : పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వరుసగా వివాదాలు చేటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో వివాదం నెలకొంది. అన్యమత వేడుకలు నిర్వహించారంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ ను సీఈవో శ్రీరామచంద్రమూర్తి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 25న గంగాసదన్ పై మోహన్ అన్యమత వేడుకలు నిర్వహించారన్న ఆరోపణలపై దేవాదాయ డిప్యూటీ కమిషనర్ విచారణ చేపట్టారు. అన్యమత వేడుకలు నిర్వహించినట్లు నిర్ధారణ అయింది. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మోహన్ పై సస్పెండ్ వేటు వేశారు.
మోహన్ మాత్రం తాను అన్యమత ప్రచారం చేయలేదని అంటున్నారు. శ్రీశైలంలో ఇలాంటి ప్రచారం చేయకూడదని తనకు తెలుసని అందుకే..ఎలాంటి ప్రచారం చేయలేదని స్ప
ష్టం చేశారు. కేవలం తన పుట్టిన రోజు వేడుకలు మాత్రమే చేసుకున్నానని తెలిపారు.
శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రచారం చేయవద్దని ఆంక్షలు ఉన్నాయి. అన్యమత ప్రచారం పట్ల బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్యమత ప్రచారం చేసేవారిపై ప్రభుత్వం, ఆలయ కమిటీ చర్యలు తీసుకోవాలని తెలిపింది.