Anjanadri Issue: తిరుమల హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనుల శంకుస్థాపన

అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా కమిటీ నిర్ధారించడంతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారి ధర్మారెడ్డి పరిశీలించారు.

Anjanadri Issue: తిరుమల హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనుల శంకుస్థాపన

Anjajndri

Updated On : February 15, 2022 / 12:58 PM IST

Anjanadri Issue: అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా కమిటీ నిర్ధారించడంతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారి ధర్మారెడ్డి పరిశీలించారు. గతేడాది జన్మస్థలాన్ని నిర్ధారించిన కమిటీ పురాణ, వాగ్మయ, భౌగోళిక ఆధారాలతో అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించినట్లు నిర్ధారించింది.

కొన్ని వందల ఏళ్లుగా బాల హనుమంతుడి ఆలయం ఆకాశగంగలో ఉంది. 2016లో ఆలయాన్ని కొంత అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఆలయంతో పాటు ఆకాశగంగ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తద్వారా భక్తులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దాలని టీటీడీ భావిస్తుంది.

ఇందులో భాగంగానే హనుమంతుని జన్మ రహస్యం తెలియజేసేట్లుగా చిత్రాలు, వీడియోలు, పుస్తకాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులకు అంజనాదేవి, బాల హనుమంతుని దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం సమయంలో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖ పీఠాధిపతులు హాజరవుతారని తెలిపారు.

Read Also : మారుతి మనవాడే అంటున్న టీటీడీ